Swelling: పాదాల్లో వాపులా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?
Swelling: సాధారణంగా ఆఫీసులో కానీ లేదంటే ఇంట్లో కాని ఒకే చోట కదలకుండా మెదలకుండా అలాగే గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి.
- By Anshu Published Date - 09:30 AM, Sun - 16 October 22

Swelling: సాధారణంగా ఆఫీసులో కానీ లేదంటే ఇంట్లో కాని ఒకే చోట కదలకుండా మెదలకుండా అలాగే గంటల తరబడి కూర్చోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. అందులో మరి ముఖ్యంగా మెడ నొప్పి,వెన్నునొప్పి,అధిక బరువు లాంటి సమస్యలతో పాటు కాళ్ళ వాపు సమస్య కూడా వస్తూ ఉంటుంది. చాలామంది దీనిని చిన్న సమస్యగా భావించి లైట్ తీసుకుంటూ ఉంటారు. కార్యక్రమంగా ఆ సమస్య పెరిగి పెద్దదయి అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. అయితే పాదాల వాపు వచ్చినప్పుడు కొన్ని రకాల చిట్కాలను ఉపయోగించి ఆ వాపును తగ్గించుకోవచ్చు..
అందుకోసం రాతి ఉప్పును ఉపయోగించి ఒక బకెట్ గోరువెచ్చని నీళ్లలో రాతి ఉప్పును కొద్దిగా వేసి ఆ నీటిలో మీ పాదాలను కొద్దిసేపు నానబెట్టడం వల్ల పాదాల వాపు తొందరగా తగ్గిపోతుంది. అలాగే ఐస్ ప్యాక్ ని ఉపయోగించి కూడా కాలవాహం తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఐస్ ప్యాక్ ని కాళ్ళ వాపు ఉన్న ప్రదేశాలలో పెట్టడం వల్ల కాళ్ళ వాపు తగ్గిపోతుంది. పుట్ మసాజ్ వల్ల కూడా పాదాల వాపును తగ్గించుకోవచ్చు. కొబ్బరి నూనె తీసుకొని గోరువెచ్చగా చేసి అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు జోడించి ఆ నూనెతో పాదాలకు అప్లై చేయడం వల్ల పాదాల వాపు తగ్గిపోతుంది. పాదాల వాపును తగ్గించడంలో పసుపు కూడా బాగా పనిచేస్తుంది.
అందుకోసం టీ స్పూన్ పసుపును తీసుకుని అందులో టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి కొద్దిసేపు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో పాదాలను కడిగితే వాపు ఇట్టే తగ్గిపోతుంది. పాదాల వాపును తగ్గించడంలో బేకింగ్ సోడా కూడా ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది. ఇందుకోసం కొంచెం నీటిని తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల బియ్యం వేసి బాగా మరిగించి అందులో రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడాను వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల పాదాల వాపు సమస్య తగ్గిపోతుంది.