Eggs in Winter: చలికాలంలో ప్రతిరోజు గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. డాక్టర్లు కూడా ప్రతిరోజు గుడ్డును తీసుకోమని చెబుతూ ఉంటారు. గ
- By Anshu Published Date - 09:30 PM, Mon - 3 July 23

గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. డాక్టర్లు కూడా ప్రతిరోజు గుడ్డును తీసుకోమని చెబుతూ ఉంటారు. గుడ్డును తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇకపోతే ముఖ్యంగా చలికాలంలో చాలామంది రోగాల బారిన పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో గుడ్డును తినడం వల్ల రోగ నిధులతో శక్తి మెరుగుపడుతుంది. చలికాలంలో గుడ్డు తినడం వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో గుడ్డు తినడం వల్ల ఒంటికి వెచ్చదనం లభిస్తుంది. గుడ్లలో మంచి కొవ్వులు ఉంటాయి.
ఇవి కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. అవయవాలను రక్షిస్తాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. గుడ్లలో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి పెంపొందించడంలో విటమిన్ డి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బలమైన రోగనిరోధక శక్తి శరీరాన్ని అంటువ్యాధుల నుండి కాపాడుతుంది. వాటితో పోరాడే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ బి6, బి12 రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో విటమిన్ బి6, బి12 కీలక పాత్ర పోషిస్తాయి. బరువు తగ్గడం గుడ్లు బరువు తగ్గడానికి అనుకూలమైన ఆహారం.
కీటో డైట్‌లోనూ గుడ్లు ప్రధాన ఆహారం. కొందరు గుడ్డులోని తెల్ల సొన మాత్రమే తినాలని, పచ్చ సొన తినొద్దని చెబుతుంటారు. కానీ అవన్నీ ఒట్టి అపోహలు మాత్రమే. గుడ్లు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. మొత్తం ఆరోగ్యానికి మేలు చేసే కొలెస్ట్రాల్ గుడ్డు వల్ల వస్తుంది. అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ స్థాయిలు గుండె పోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుడ్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచవు. అలాగే అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. గుడ్డు తినడం వల్ల అది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. ఆకలి కాకుండా చూస్తాయి. గుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో విటమిన్లు ఖనిజాలు గుడ్లలో ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి.