Dreams : కలలో మీకు అవి కనిపించాయా.. అయితే వాటి అర్థం ఇదే?
కొన్నిసార్లు పీడకలలు వస్తే కొన్నిసార్లు మంచి కలలు (Dreams) కూడా వస్తూ ఉంటాయి.
- By Naresh Kumar Published Date - 07:00 PM, Mon - 27 November 23

Dreams : మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అనేది సహజం. అయితే కొన్నిసార్లు పీడకలలు వస్తే కొన్నిసార్లు మంచి కలలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది మంచి కలలు వచ్చినప్పుడు సంతోషపడి పీడకలలు (Dreams) వచ్చినప్పుడు తెగ భయపడిపోతూ ఉంటారు. అలాగే కలలో మనకు పక్షులు జంతువులు మనుషులు రకరకాల సంఘటనలు కనిపించడం అన్నది సహజం. ఇది ఎటువంటివి కలలో కనిపించినప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re Now on WhatsApp. Click to Join.
కలలో (Dreams) కనక పాము కనిపిస్తే ధనానికి రక్షకులుగా భావించాలి. ఇలా కలలో పాములు కనిపించడం అన్నది లాభదాయకం. భవిష్యత్తులో కూడా భారీగా డబ్బులు వస్తాయని అర్థం. కలలో గులాబీ పూలు కనిపించడం అన్నది కూడా శుభసంకేతంగా భావించాలి. లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి గులాబీ పువ్వులు కలలో కనిపించాయి అంటే త్వరలోనే ధన లాభం కలగబోతోందని అర్థం. అదేవిధంగా కలలో మీకు కమలం పూలు కనిపిస్తే లక్ష్మీ కటాక్షం కలగబోతోందని అర్థం. అంతులేని సంపదలు కలుగుతాయని అర్థం.
లక్ష్మీదేవి ఎప్పుడు కమలం పువ్వు పైన కూర్చుని ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కలలో మనకు డాన్స్ చేస్తున్న కన్య కనిపిస్తే చాలా లాభదాయకంగా భావించాలి. ఇలాంటి కల రావడమంటే అర్ధం జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయని అర్ధం. అంటే మీకు త్వరలో ఉన్నత పదవి, డబ్బులు, గౌరవం అన్నీ చేకూరుతాయి. అలాగే కలలో ఏనుగు కనిపిస్తే ఉన్నత పదవి గౌరవం మర్యాదలు దక్కుతాయని అర్థం. అయితే వీటిలో కొన్ని మాత్రమే నిజం అవుతాయి. ముఖ్యంగా తెల్లవారుజామున సమయంలో వచ్చే కలలు తొందరగా నెరవేరుతాయి అని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు.
Also Read: Three Elephants Dies: ఉత్తర బెంగాల్‌లో గూడ్స్ రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి