Happy Promise Day : నేడే ‘ప్రామిస్ డే’.. వాగ్దానం చేసేయండి.. గిఫ్టులు ఇచ్చేయండి
Happy Promise Day : ఫిబ్రవరి 7 నుంచి 14 మధ్య సాగే వాలెంటైన్స్ వీక్‌లో అత్యంత కీలకమైన రోజు ఫిబ్రవరి 11
- Author : Pasha
Date : 11-02-2024 - 9:15 IST
Published By : Hashtagu Telugu Desk
Happy Promise Day : ఫిబ్రవరి 7 నుంచి 14 మధ్య సాగే వాలెంటైన్స్ వీక్‌లో అత్యంత కీలకమైన రోజు ఫిబ్రవరి 11. ఎందుకంటే ఇవాళ ప్రామిస్ డే(Happy Promise Day). మీరు ప్రేమించే వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ప్రామిస్ చేసే రోజు ఇది. ప్రామిస్ డే అనేది మీ భాగస్వామికి మీ అంతులేని ప్రేమ, సంరక్షణను వాగ్దానం చేయడానికి సరైన సందర్భం. జీవితంలోని కష్టసుఖాలు, సంతోషం, దుఃఖం, బాధలు సమానంగా పంచుకుంటామని ఈ రోజున చేతిలో చెయ్యేసి చెప్పాలి. ఈ రోజున ప్రేమ జంటలు ఒకరికొకరు గులాబీ పువ్వులను ఇచ్చుకొని తమ ప్రేమను చాటుకుంటాయి.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ వాగ్దానం ఇలా
- ‘‘నేను ఎప్పటికీ నీతోనే ఉన్నాను.. ఉంటాను.. మనం కలిసి తీసుకున్న ఫొటోలో నువ్వే.. నా ఊపిరిలో నువ్వే.. నేనెప్పుడూ నీతోనే ఉంటాను’’ అనే టెక్స్ట్‌తో కూడిన ఫోటో ఫ్రేమ్‌ను మీ ప్రేయసి/ప్రేమికుడికి ఇవ్వొచ్చు.
- ‘‘ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తివి నువ్వే. నువ్వు తప్ప నా జీవితంలో వేరేవారికి చోటు లేదు. ఈ క్షణాన్ని ఎప్పటికీ మరచిపోలేను. నీ నీడలా నీతో ఉంటాను’’ అని మీ ప్రేయసి/ప్రేమికుడికి మాట ఇవ్వండి.
- ‘‘మన మధ్య గొడవలు జరగడం సాధారణమే.. ప్రాణం పోయినా నిన్ను వదలను. ఇదే నా మాట.. గొడవ పడితే దాన్ని అక్కడితోనే ముగిస్తాను.. అదే విషయాన్ని లాగను’’ అని మీ ప్రేయసి/ప్రేమికుడికి చెప్పండి.
Also Read : Electoral Bonds : 10 రెట్లు పెరిగిన టీడీపీ విరాళాలు.. నంబర్ 1 బీజేపీ
ప్రామిస్ డే గిఫ్ట్ ఐడియాలు
- మీ ప్రేయసి/ప్రేమికుడికి కొవ్వొత్తిని బహుమతిగా ఇవ్వడం ద్వారా నీ జీవితానికి ఎప్పటికీ వెలుగుగా ఉంటానని వాగ్దానం చేయండి. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అంటూ సువాసనగల కొవ్వొత్తిని అందించండి. ఇది కచ్చితంగా మీ భాగస్వామి ముఖంలో చిరునవ్వును నింపుతుంది.
- ప్రతి మానవ సంబంధానికి పువ్వులను ఉత్తమ బహుమతులుగా పరిగణిస్తారు. మీ భాగస్వామికి ప్రేమ, అందం, ఆనందంతో నిండిన జీవితాన్ని వాగ్దానం చేయడానికి పూల బొకేలను ఇవ్వండి. ఒక పూల బొకే ఇచ్చి వాగ్దానం చేయండి. పువ్వుల అందం మీ ప్రేయసి/ప్రేమికుడి కళ్లను ఆకర్షిస్తుంది. మీ మాటలు వారి ముఖంపై చిరునవ్వును తెస్తుంది.
- మీరు మీ ప్రేయసి/ప్రేమికుడి పట్ల ప్రేమను చూపించాలి. వారి సంతోషకరమైన జీవితం కోసం వాగ్దానం చేయాలి. ప్రామిస్ చేస్తూ ఉంగరం బహుమతిగా ఇవ్వండి. మీ భాగస్వామికి ప్రామిస్ ఉంగరాన్ని ఇవ్వడం వారి పట్ల మీ శాశ్వతమైన ప్రేమను సూచిస్తుంది.