Hair Tips: బట్టతలతో బాధపడుతున్నారా.. అయితే బీట్రూట్ తో ఈ ప్యాక్ ట్రై చేయాల్సిందే?
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో బట్టతల సమస్య కూడా ఒకటి. ముఖ్యంగా పురుషులు ఈ బట్టతల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొం
- By Anshu Published Date - 05:00 PM, Thu - 21 December 23

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో బట్టతల సమస్య కూడా ఒకటి. ముఖ్యంగా పురుషులు ఈ బట్టతల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక బట్టతలపై వెంట్రుకలు రావాలి అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లోకి ఎన్నో రకాల క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా బట్టతల పైన జుట్టు రావడం కోసం వేలకు వేలు ఖర్చులు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేక దిగులు చెందుతూ ఉంటారు. ఇంకొందరు ఇంట్లోనే ఉండే వాటిని ఉపయోగిస్తూ హోమ్ రెమెడీలను ఫాలో అవుతూ ఉంటారు.
అటువంటి వాటిలో బీట్రూట్ ప్యాక్ కూడా ఒకటి. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడంలో బీట్రూట్ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది బీట్రూట్ ఆరోగ్యానికి అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటూ ఉంటారు. ఇది వెంట్రుకలను మొలిపించడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. హెయిర్ ప్యాక్ కోసం 2 టేబుల్ స్పూన్ల అల్లం రసం, 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, దుంప రసం ఒక కప్పు తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాన్లో ఒక అరకప్పు బీట్రూట్ జ్యూస్ తీసుకోవాలి. దానికి రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసాన్ని కలుపుకోవాలి.
తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంతే బీట్రూట్ హెయిర్ ప్యాక్ సిద్ధం. ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా జుట్టుకు బాగా అప్లై చేయాలి. తర్వాత తలపై స్మూత్ గా మసాజ్ చేయించుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ ని 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత జుట్టుని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ఈ ప్యాక్ ని వారానికి రెండు సార్లు వాడుకోవచ్చు. బట్టతల సమస్య నుండి బయటపడవచ్చు. బీట్రూట్ హెయిర్ ప్యాక్ సర్వసాధారణమై నది దీన్ని వాడడం వలన జుట్టు తలపై ఎటువంటి చెడు ప్రభావాలు కలగవు. దీనిని అప్లై చేసుకోవడం వలన జుట్టు సమస్యలు అన్ని తగ్గిపోతాయి. బట్టతల సమస్యను నుంచి ఉపశమనం పొందవచ్చు. బీట్రూట్ హెయిర్ ప్యాక్ సహాయంతో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా జుట్టుకి బలాన్ని కూడా కలిగిస్తుంది. బీట్రూట్ తో తయారు చేసిన హెయిర్ ప్యాక్ ని ఎవరైనా వాడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.