Hair Tips: చలికాలంలో హెయిర్ ఫాల్ కాకుండా జుట్టు బాగా పెరగాలంటే ఈ చిట్కాలను ఉపయోగించాల్సిందే?
చలికాలం మొదలయ్యింది. చలికాలం మొదలయ్యింది అంటే చాలు ఆరోగ్య సమస్యలతో పాటు అందానికి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. జుట్టుకు అలాగే స్కిన్ కి
- By Anshu Published Date - 07:05 PM, Mon - 18 December 23

చలికాలం మొదలయ్యింది. చలికాలం మొదలయ్యింది అంటే చాలు ఆరోగ్య సమస్యలతో పాటు అందానికి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. జుట్టుకు అలాగే స్కిన్ కి సంబంధించిన సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఈ శీతాకాలంలో చాలామందికి హెయిర్ ఫాల్ కావడంతో పాటు జుట్టు మొత్తం చిట్లిపోయినట్టుగా అయ్యి అధికంగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. కాగా ఇతర కాలాలతో పోలిస్తే చలికాలం జుట్టు ఎక్కువగా ఉడిపోవడానికి గల కారణం తల మీద వేడి నీళ్లు పోసుకుంటే హాయిగా ఉంటుందని చలికాలం ఎక్కువ వేడి పోసుకోవడానికి ఇష్ట పడటం.
అయితే చలికాలంలో వీలైనంతవరకు వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే బాడీ చల్లగా ఉంటుంది కాబట్టి తలపై వేడి నీరు పోసేసరికి జుట్టు కుదుర్లలో ఉండే రక్తనాళాలు వ్యాకోచించి లోపల కుదుళ్లలో ఉన్న నీరు తగ్గిపోతుంది. ఆ వేడికి జుట్టు విరిగిపోతుంది. కాబట్టి చలికాలంలో ఇతర కాలాలతో పోలిస్తే జుట్టు ఎక్కువ ఉడిపోవడానికి కారణమవుతూ ఉంటుంది. ఎండాకాలంలో జరగని నష్టం చలికాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కేవలం వేడి నీళ్ళని నెత్తికి ఎక్కువగా పోసుకోవడం వలన ఈ విధంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అందుకని దీనికి ఒక పరిష్కారం ఉంది.
వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు కానీ ఎక్కువగా వేడి ఉన్న నీటితో తల స్నానం చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది. జుట్టుకి ఎప్పుడు చన్నీళ్లే మంచిది ఈ విధంగా చన్నీళ్లతో చేయడం వలన జుట్టు కుదుళ్ళు చాలా బలంగా మారతాయి జుట్టు విరిగిపోదు. అలాగే చలికాలంలో గాఢత ఎక్కువ ఉన్న షాంపులను ఉపయోగించడం కూడా అంత మంచిది కాదు.