Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?
Hair Growth: జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే పువ్వును ఉపయోగించి కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే జుట్టు పొడవుగా పెరగడం ఖాయం అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:30 AM, Sun - 19 October 25

Hair Growth: ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులను ఇబ్బంది పెడుతున్న సమస్యలలో జుట్టు సమస్య కూడా ఒకటి. హెయిర్ ఫాల్, బట్టతల, జుట్టు పల్చగా అయిపోవడం వంటి చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ ఉపయోగించడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇలా జుట్టు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారి కోసమే ఈ చిట్కా.
ఇప్పుడు చెప్పబోయే పువ్వుని ఉపయోగించి జుట్టుకు సంబంధించిన చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఈ పువ్వు జుట్టు మందాన్ని పెంచుతుందట. అలాగే వెంట్రుకల డ్యామేజీని తగ్గించి ఇది జుట్టుకు సహజమైన మెరుపు, తేమను కూడా అందిస్తుందని,జుట్టుకు రంగును ఇచ్చే మెలనిన్ ఉత్పత్తికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు కూడా ఇందులో ఉన్నాయని చెబుతున్నారు. ఆ పువ్వు మరి ఏదో కాదు మందారం పువ్వు. మందార ఆకులు అలాగే పువ్వులు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎంతో ఎఫెక్టీవ్ గా పని చేస్తాయి.
మరి మందారంని ఉపయోగించి జుట్టు సమస్యలు ఎలా తగ్గించుకోవాలి అన్న విషయాన్ని వస్తే.. మందార నూనె జుట్టుని పునరుజ్జీవింపజేయడానికి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఒక గొప్ప మార్గం అని చెప్పాలి. ఇది జుట్టుకు పోషణ, తేమను అందిస్తుందట. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని, జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. ఎనిమిది మందార పువ్వులను ఆకులతో కలిపి బాగా రుబ్బి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి నూనె వేడి చేసి ఈ పేస్ట్ ని అందులో వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లబరిచి నూనెను వడకట్టాలి. ప్రతిరోజూ స్నానం చేసే ముందు మీ తల, జుట్టును 10 నిమిషాలు మసాజ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.
అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి చమోమిలే పేస్ట్‌ను ఉసిరికాయ పొడితో కలిపి వాడాలని చెబుతున్నారు. ఇది జుట్టు మందాన్ని పెంచుతుందటీ. వెంట్రుకల డ్యామేజీని తగ్గిస్తుందని, ఇది జుట్టుకు సహజమైన మెరుపు, తేమను జోడిస్తుందని చెబుతున్నారు. చమోమిలేలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి జుట్టుకు రంగును ఇచ్చే మెలనిన్ ఉత్పత్తికి అవసరం అని చెబుతున్నారు. కాగా మందార పొడి, గూస్బెర్రీ పొడిని సమాన పరిమాణంలో నీటితో కలిపి మృదువైన పేస్ట్ లా తయారు చేసుకొని దీన్ని మీ జుట్టు, తలపై బాగా అప్లై చేసి 40 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి కడిగేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.