Hair Fall : మీరు మీ జుట్టుకు నూనె ఎక్కువగా రాస్తున్నారా..? అయితే మీ జుట్టు మరింతగా రాలడం ఖాయం
జుట్టుకు ఎక్కువ నూనె (Oil) రాయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ అనేటివి బ్లాక్ అవుతాయి. మీకు ఇప్పటికే హెయిర్ ఫాల్ సమస్య ఉంటే.. ఎక్కువ నూనె జుట్టుకు రాయొద్దు
- By Sudheer Published Date - 04:47 PM, Wed - 18 October 23
ప్రతి ఒక్కరిలో ఏదొక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు , ఉద్యోగ ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. అలాగే జుట్టు (Hair) రాలడం (Hair Fall) కూడా చాలామందిని ఇబ్బంది పెట్టె సమస్య గా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవనశశైలీ, కాలుష్యం ఇలా అనేక రకాల కారణాల వల్ల చాలామందికి జుట్టు రాలుతుంటుంది. జుట్టు రాలకుండా ఉండేందుకు చాలామంది పలు రకాల మెడిసిన్స్ వాడుతుంటారు కానీ జుట్టు రాలడం మాత్రం తగ్గదు.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే జుట్టుకు ఎక్కువగా నూనె రాయడం వల్ల కూడా జుట్టు రాలుతుందని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. జుట్టుకు ఎక్కువ నూనె (Oil) రాయడం వల్ల హెయిర్ ఫోలికల్స్ అనేటివి బ్లాక్ అవుతాయి. మీకు ఇప్పటికే హెయిర్ ఫాల్ సమస్య ఉంటే.. ఎక్కువ నూనె జుట్టుకు రాయొద్దు. అంతే కాదు, రాత్రిపూట నూనె రాసుకుని నిద్రపోవడం వల్ల జుట్టు టెలోజెన్ దశకు చేరి చాలా నష్టం కలిగిస్తుంది. ఇది వెంట్రుకల ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేసి జుట్టు రాలడానికి కారణం అవుతుందని చెపుతున్నారు. హెయిర్ ఫాల్ సమస్య పెరిగితే.. జుట్టును కొద్దిగా తెరిచి ఉంచి ఒత్తిడిని తగ్గించుకోవాలి.. ఇక, సరైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒత్తిడి , ఆహారం కూడా జుట్టు రాలడానికి దోహదం చేస్తాయి.. కాబట్టి మీరు మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సెలూన్ ట్రీట్మెంట్లను తగ్గించుకోవడంతో పాటు.. ఒత్తిడిని తగ్గించుకోని.. మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Pneumonia Cases: నగరంలో పెరుగుతున్న న్యుమోనియా, ఇన్ఫ్లుయెంజా కేసులు
Related News
Hair Care : వేసవిలో ఈ 3 తప్పులు చేయకండి.. మీ జుట్టు నిర్జీవంగా మారుతుంది.!
ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా మరియు ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు.