Hair Care: జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అంటే వీటిని తప్పకుండా తినాల్సిందే?
హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే వాటిని తినాల్సిందే అంటున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Thu - 20 February 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీ,పురుషులు హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. జుట్టు బాగా పెరగడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ షాంపూలు ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకున్న వారు తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలట. ముఖ్యంగా బయోటిన్ లేదా విటమిన్ బి7 ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట.
ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం అన్నది ప్రధాన సమస్యగా మారింది. అధికంగా జుట్టు రాలడం వల్ల బట్టతల సులువుగా వస్తుంది. కానీ కొంచెం జుట్టు రాలుతున్నట్లు అనిపిస్తే చాలా మంది తొందరపడి మార్కెట్లో లభించే రకరకాల షాంపూలు, ఇతర ఉత్పత్తులు తెచ్చి వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య నుంచి బయటపడటానికి బదులు ఇంకా తీవ్రం అవుతుందట. నిజానికి జుట్టు రాలడం నివారించడానికి బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. బయోటిన్ లేదా విటమిన్ బి7 ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చిలగడదుంపలలో బయోటిన్, బీటా కెరోటిన్ ఉంటాయి.
ఇది శరీరానికి విటమిన్ ఎ ని అందిస్తుంది. విటమిన్ ఎ ఆరోగ్యకరమైన చర్మం, కణాల ఉత్పత్తికి తోడ్పడుతుందట. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు కూడా ఇది దోహదం చేస్తుందట. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించి జుట్టును బలపరుస్తుందని చెబుతున్నారు. అలాగే ఆకు కూరల్లో ఒకటైన పాలకూరలో బయోటిన్, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయట. దీనిని తరచుగా వినియోగించడం వల్ల ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుందట. ఇది ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి అవసరమైన పోషకాలను అందిస్తుందట. అలాగే జుట్టు చివరలను బలోపేతం చేస్తుందట. జుట్టు కూడా పొడవుగా పెరుగుతుందట. అందువల్ల, పాలకూరను సలాడ్లలో సైడ్ డిష్‌గా, రోజువారీ భోజనంలో ఇతర మార్గాల్లో తీసుకోవచ్చని చెబుతున్నారు. మాంసం, సముద్ర ఆహారాల్లో కూడా ప్రోటీన్, బయోటిన్ అధికంగా ఉంటాయి. మాంసం, సముద్ర ఆహారం తీసుకోవడం వల్ల కూడా జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ప్రతిరోజూ గుడ్లు తినడం అస్సలు ఆరోగ్యానికి ఏ మాత్రం హానికరం కాదట. ఇందుకు విరుద్ధంగా రోజు గుడ్డు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట. గుడ్లలో కొవ్వు ఉంటుందని, అయితే ఇది శరీరానికి మంచిదని చెబుతున్నారు.