Guthi Vankaya Vepudu: రెస్టారెంట్ స్టైల్ గుత్తివంకాయ వేపుడు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే?
మామూలుగా మనం వంకాయతో అనేక రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. వంకాయ వేపుడు, వంకాయ మసాలా కర్రీ, వంకాయ చట్నీ, వాంగిబాత్ అంటూ ర
- By Anshu Published Date - 08:30 PM, Mon - 15 January 24

మామూలుగా మనం వంకాయతో అనేక రకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. వంకాయ వేపుడు, వంకాయ మసాలా కర్రీ, వంకాయ చట్నీ, వాంగిబాత్ అంటూ రకరకాల రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా రెస్టారెంట్ స్టైల్ లో గుత్తి వంకాయ వేపుడు చేసుకొని తిన్నారా. ఎప్పుడు తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుత్తివంకాయ వేపుడుకి కావాల్సిన పదార్థాలు:
వంకాయలు – అర కిలో
నూనె – 3 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర – కొద్దిగా
శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
మినపగుళ్లు – అర టీస్పూన్
ధనియాలు – అర టీస్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఎండు మిర్చి – 10 నుంచి 12
ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు
కరివేపాకు – 2 రెమ్మలు
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – పావు టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 5
నూనె – 1 టీ స్పూన్
గుత్తివంకాయ వేపుడు తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా వంకాయలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఉప్పు నీటిలో వేయాలి. తర్వాత కడాయిలో పల్లీలు వేసి దోరగా వేయించిన తర్వాత ప్లేట్ లోకి తీసుకుని అదే కడాయిలో శనగపప్పును కూడా వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మినుప గుళ్లు , ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. వీటిని దోరగా వేయించిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఎండు కొబ్బరి, వేసి వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక జార్ లోకి వీటిని తీసుకొని ముందుగా శనగపప్పు, దినుసులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి, ఎండు మిర్చీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పల్లీలతోపాటు మిగిలిన పదార్థాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసి వేడయ్యా వంకాయలు వేసి మూత పెట్టి చిన్న మంటపై వేయించాలి. వీటిని మధ్య మధ్యలో తిప్పుతుండాలి. వంకాయలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. వంకాయలు మెత్తగా మగ్గిన తర్వాత మిగిలిన పొడిని కూడా చల్లుకోవాలి. ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత కొత్తమిర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన గుత్తివంకాయ వేపుడు రెడీ.