Leaves Benefits: ఈ చిన్ని ఆకులతో షుగర్ తగ్గడం నుంచి జుట్టు పెరగడం వరకు ఎన్నో లాభాలు!
Leaves Benefits: ఇప్పుడు చెప్పబోయే ఈ ఆకులతో షుగర్ తగ్గడం నుంచి జుట్టు పెరగడం వరకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆకులు ఏవి వాటిని ఎలా ఉపయోగించాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:30 AM, Tue - 28 October 25
Leaves Benefits: ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధాల మొక్కలు అందించింది అన్న విషయం తెలిసిందే. అందులో కొన్నింటిని మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. అటువంటి వాటిలో జామ మొక్క కూడా ఒకటి. ఈ జామ మొక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ చెట్టు యొక్క ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటి ఆకుల వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బరువు తగ్గాలని కోరుకునే వారికి జామ ఆకు సహాయం చేస్తుంది. ఈ ఆకు రసం తాగితే శరీరంలో మెటాబాలిజం పెరిగి కొవ్వు పేరుకోకుండా నియంత్రిస్తుంది. రాత్రిపూట ఒక గ్లాస్ జామ ఆకు టీ తాగితే క్రమంగా బరువు తగ్గడంలో సహాయపడుతుందట. మధుమేహం ఉన్నవారికి కూడా జామ ఆకు చాలా ఉపయోగకరంగా ఉంటుందట. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయట. క్రమం తప్పకుండా జామ ఆకు నీరు తాగితే షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు.
జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడతాయి. జామ ఆకులను మరిగించి ఆ నీటితో తలస్నానం చేస్తే జుట్టు వేర్లు బలపడతాయట. చుండ్రు కూడా తగ్గుతుందని జుట్టు మెరిసిపోతుందని చెబుతున్నారు. చర్మ సమస్యలకూ జామ ఆకు మంచి మందు అని చెప్పాలి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. ఆకు పేస్ట్ రాసుకుంటే చర్మం శుభ్రంగా, తాజాగా ఉంటుందట. గాయాలు కూడా త్వరగా మానడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జీర్ణకోశ సమస్యలకు జామ ఆకు ఔషధం లాంటిది. ఆకు ముద్ద కడుపులోని ఇబ్బందులను తొలగిస్తుందట. విరేచనాలు తగ్గిస్తుందని మలబద్ధకం సమస్యను కూడా క్రమంగా సరిచేస్తుందని చెబుతున్నారు. అయితే కేవలం కొంతమందికి జామపండు వల్ల మాత్రమే లాభాలు కలుగుతాయి అని తెలుసు. కానీ జామ ఆకుల వల్ల కూడా అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామందికి తెలియదు.