Green Mirchi Chicken Pulao: ఎంతో స్పైసీగా ఉండే పచ్చిమిర్చి కోడి పులావ్.. టేస్టీగా తయారు చేసుకోండిలా?
మాంసాహార ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే రెసిపీ కు చికెన్.. మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. చి
- By Anshu Published Date - 03:30 PM, Fri - 15 March 24

మాంసాహార ప్రియులు ఎక్కువ శాతం మంది ఇష్టపడే రెసిపీ కు చికెన్.. మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ పులావ్, చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ కబాబ్ చికెన్ తందూరి ఇలా ఎన్నెన్నో తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా స్పైసీగా ఉండే పచ్చిమిర్చి కోడిపులావ్ తిన్నారా. ఒకవేళ ఈ రెసిపీఙ్ తినకపోతే ఈ రెసిపీ ని సింపుల్ గా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
చికెన్ ముక్కలు – అరకిలో
బాస్మతి బియ్యం – అరకిలో
పచ్చిమిర్చి – అయిదు
ఉల్లిపాయ – ఒకటి
పుదీనా – ఒక కట్ట
కొత్తిమీర – ఒక కట్ట
పసుపు – పావు టీస్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
పెరుగు – ఒక కప్పు
గరం మసాలా పొడి – అర స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
మిరియాల పొడి – అర స్పూను
నెయ్యి – రెండు స్పూన్లు
నూనె – తగినంట
మసాలా దినుసులు – గుప్పెడు
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం :
ముందుగా చికెన్ ముక్కలు కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి, మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ మీద బిర్యానీ వండే గిన్నె పెట్టాలి. నూనె వేయాలి. నూనె వేడెక్కాక నిలువుగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి. అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి వేయించాలి. అవి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కలపాలి. అన్నీ వేగాక చికెన్ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. కప్పు పెరుగు వేసి కలపాలి. అరగ్లాసు నూనె వేసి కలిపి మూత పెట్టి మగ్గించాలి. చికెన్ ముక్క ఉడికిన తరువాత బాస్మతి బియ్యాన్ని కలిపి, ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. అందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వంటి మసాలా దినుసులు వేసి కలపాలి. మూత పెట్టి ఉడికించాలి. 80 శాతం ఉడికాక నెయ్యి వేసి కలపాలి. అన్నం ఉడికాక స్టవ్ కట్టేయాలి. అంతే పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ.