Mustard Leafy Greens : ఆవాల ఆకుకూరతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?
Mustard Leafy Greens : చలికాలంలో స్పెషల్ ‘ఆవాల ఆకుకూర’ !! ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.
- By Pasha Published Date - 08:25 PM, Sun - 26 November 23

Mustard Leafy Greens : చలికాలంలో స్పెషల్ ‘ఆవాల ఆకుకూర’ !! ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని మొక్కజొన్న రొట్టెతో తింటే టేస్టీగా అనిపిస్తుంది. ఆవాల ఆకుకూర శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ A, C, K పుష్కలంగా ఉంటాయి. గాయాలైనప్పుడు.. రక్తం కారిపోకుండా ఉండాలంటే విటమిన్ కే అవసరం. దీన్ని తింటే ఎముకలకు బలం వస్తుంది. ఆవాల ఆకుల్లో గ్లూకోసినోలేట్స్ అనే ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. గ్లూకోసినోలేట్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఆవాల ఆకుకూరలో అధిక మొత్తంలో విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటిన్ ఉన్నాయి. గుండె జబ్బులతో మరణాల ముప్పు సంభవించకుండా ఇవి నిరోధిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా ఆవాల ఆకుకూర కరిగిస్తుంది. ఆవాల ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్ ప్రొఫైల్‌లో లుటిన్, జియాక్సంతిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆవపిండిలో ఉండే ఫైబర్ పేగు సమస్యలను, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆవాల పంట ప్రధానంగా పంజాబ్‌లో పండుతుంది. రాజస్థాన్‌లోని బికనీర్, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాలలో కూడా ఆవాల పంట(Mustard Leafy Greens) పండుతుంది.
Also Read: Ayushman Arogya Mandir : ‘ఆయుష్మాన్ భారత్’ హెల్త్ సెంటర్ల పేరు మారిపోయింది