Ghee Mysore Pak: నేతి మైసూర్ పాక్ ఇలా చేస్తే చాలు నోట్లో వేసుకోగానే కరిగిపోవడం ఖాయం?
మాములుగా మనకు ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్లు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. దాంతో కొందరు ఎప్పుడు ఒకే రకమైన స్వీట్ కాకుండా అప్పుడప్పుడు ఏదైనా సర
- By Nakshatra Published Date - 09:04 PM, Sat - 16 March 24
మాములుగా మనకు ఎప్పుడూ ఒకే రకమైన స్వీట్లు తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. దాంతో కొందరు ఎప్పుడు ఒకే రకమైన స్వీట్ కాకుండా అప్పుడప్పుడు ఏదైనా సరికొత్తగా స్వీట్ రెసిపీ ట్రై చేయాలనీ అనుకుంటూ ఉంటారు. మీరు కూడా ఏదైనా కొత్తగా రెసిపీ ట్రై చేయాలనీ అనుకుంటున్నారా. అయితే ఎంతో టేస్టీగా ఉండే నేతి మైసూర్ పాక్ ఇంట్లోనే సింపుల్ గా ట్రై చేయండిలా.
కావాల్సిన పదార్థాలు :
శెనగపిండి – ఒక కప్పు
పంచదార – ఒకటిన్నర కప్పు
నెయ్యి – ఒక కప్పు
నూనె – అర కప్పు
పాలు – అర కప్పు
కావాల్సిన పదార్థాలు :
ఇందుకోసం ముందుగా స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టి అందులో చక్కెర, పాలు పోసి పాకం తీయాలి. మరీ ముదురుపాకం తీయకూడదు. తర్వాత స్టవ్‌ను చిన్న మంట మీదకు మార్చాలి. అందులో సెనగ పిండి వేసి కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. పిండి కాస్త చిక్కగా అయినప్పుడు అందులో నెయ్యి కొద్దికొద్దిగా పోస్టూ కలుపుకోవాలి. అలాగే నూనె కూడా కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. మాడిపోకుండా ఉండాలంటే కలుపుతూనే ఉండాలి. కోవాలాగా దగ్గరగా అయ్యాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు ఒక పళ్లానికి నెయ్యి రాసి, వేడిగా ఉన్నప్పుడే మొత్తం పిండిని పళ్లెంతో వేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే ఎంతో టెస్టిగా ఉండే నేతి మైసూర్ పాక్ రెడీ.