Pregnant Tips: గర్భిణీలు మొక్కజొన్న తినచ్చా.. నిపుణులు చెబుతున్న విషయాలు ఇవే?
స్త్రీలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. పెళ్లి అయిన ప్రతి ఒక స్త్రీ కూడా తల్లి అవ్వాలి అని కోరుకుంటూ ఉంటుంది. అయితే గర్భవతి అయిన తర్వాత గర్భిణీలు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు.
- By Anshu Published Date - 08:30 AM, Sat - 15 October 22

Pregnant Tips: స్త్రీలకు తల్లి అవ్వడం అన్నది దేవుడిచ్చిన గొప్ప వరం. పెళ్లి అయిన ప్రతి ఒక స్త్రీ కూడా తల్లి అవ్వాలి అని కోరుకుంటూ ఉంటుంది. అయితే గర్భవతి అయిన తర్వాత గర్భిణీలు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. తినే ఆహారం నుంచి పడుకునే బెడ్ వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా అనేక రకాల జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు గర్భిణీలు దూరంగా ఉండాలి అని చెబుతూ ఉంటారు. మరి గర్భిణీలు మొక్కజొన్న తినవచ్చా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భిణీలు తినే ఆహరం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అంతేకాకుండా ఆహారం విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అలా కాకుండా ఏది పడితే అది తింటే బిడ్డ ఆరోగ్యంతో పాటు తల్లి కూడా ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. అయితే సాధారణంగా గర్భిణీలు మొక్కజొన్నను తినొచ్చట. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో ఏదైనా ఇతర సమస్య ఉంటే మాత్రం మొక్కజొన్నకు దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్నలో విటమిన్ బి1, విటమిన్ బి5, విటమిన్ సి, ఖనిజాలు, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మొక్కజొన్నలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. అయితే గర్భంతో ఉన్నప్పుడు దీన్ని తినాలి అనిపిస్తే ఎటువంటి భయం లేకుండా తినొచ్చు. కానీ మొక్కజొన్నను తినే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా గర్భంతో ఉన్నప్పుడు ఆడవారి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. మొదటి మూడు నెలలు, చివరి రెండు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు విటమిన్ మాత్రలు లేదా ఏదైనా ఇతర మాత్రలు తీసుకుంటుంటే డాక్టర్ సలహా తీసుకునే మొక్కజొన్నను తినాలి. ఎందుకంటే ఈ మందు బిల్లలు మొక్కజొన్నతో కలిసి శరీరం పై చెడు ప్రభావాన్ని చూపించవచ్చు. మొక్కజొన్నలో పీచు ఉంటుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్యను కూడా నివారిస్తుంది. చాలా మందీ స్త్రీలు గర్భాధారణ సమయంలో మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి మొక్కజొన్న మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. అటువంటి అప్పుడు మొక్కజొన్న తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మొక్క జొన్న ఎముకలను బలంగా కూడా ఉంచుతుంది. చాలా మంది గర్భిణులు రక్తహీనత సమస్యను ఫేస్ చేస్తుంటారు. గర్భిణుల్లో రక్తహీనత సమస్యను పోగొట్టడానికి మొక్కజొన్నలో ఉండే విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్లు సహాయపడతాయి.