HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Follow These Tips For An Elegant Look In Your Bathroom

Bathroom Tips : మీ బాత్‌రూమ్‌ లో ఎలిగెంట్‌ లుక్‌ కోసం ఈ టిప్స్‌ పాటించండి..!

మనం ఇంటిని అలంకరించుకునే (Decorate) ప్పుడు బెడ్ రూమ్, కిచెన్‌, డైనింగ్, డ్రాయింగ్ రూమ్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటాం.

  • By Maheswara Rao Nadella Published Date - 10:30 AM, Sun - 8 January 23
  • daily-hunt
Vastu For Toilets
Vastu For Toilets

మనం ఇంటిని అలంకరించుకునే ప్పుడు బెడ్ రూమ్, కిచెన్‌, డైనింగ్, డ్రాయింగ్ రూమ్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటాం. కానీ బాత్‌రూమ్‌ (Bathroom) విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం. మనం ఎలాంటి ఆలోచనలు, బాధలు లేకుండా ప్రశాంతంగా గడిపే చోటు బాత్‌రూమ్‌‌‌‌‌‌‌. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అలసట మొత్తం.. స్నానాల గదిలో ఒక రిఫ్రెషింగ్‌ బాత్‌తో మాయం అయిపోతుంది. అలాంటి బాత్‌రూమ్‌ను అందంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవాలని ఇంటీరియర్ నిపుణులు చెబుతున్నారు. మీ బాత్‌రూమ్‌ను ఎట్రాక్టివ్‌గా ఎలా రెడీ చేసుకోవాలో తెలుసుకోండి..

ఎలిగెంట్‌ లుక్‌ (Elegant Look) ఇవ్వండి:

బాత్‌రూమ్‌ (Bathroom) టైల్స్‌ సెలెక్షన్‌లో స్పెషల్‌ కేర్‌ తీసుకోవాలి. మరీ డార్క్‌ కలర్‌ టైల్స్‌ తీసుకుంటే.. బాత్‌రూమ్‌ చిన్నగా కనిపిస్తుంది. మీ స్నానాలగది విశాలంగా కనిపించాలంటే.. తెలుపు, లైట్‌ కలర్‌ టైల్స్‌ సెలెక్ట్‌ చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే మీ బాత్‌రూమ్‌కు ఎలిగెంట్‌ లుక్‌ వస్తుంది.

షవర్ కర్టెన్స్‌ (Shower Curtain):

10 stylish shower curtains for a modern bathroom | 10 Stunning Homes

షవర్ కర్టెన్స్ బాత్‌రూమ్‌ని లుక్‌ని మార్చేస్తాయి. చాలా మంది ప్లెయిన్‌ని వేస్తుంటారు. అలా కాకుండా.. ఇందులో గ్రాఫిక్స్‌తో కూడినవి వస్తున్నాయి. వీటిని వేయడం వల్ల బాత్ రూమ్‌లుక్ మారిపోతుంది. వీటిని వేయడం వల్ల మీరు స్నానం చేసినప్పుడు ఆ నీరంతా కూడా బాత్‌రూమ్‌‌లో మొత్తం పడకుండా ఉంటుంది. కాబట్టి ఓ సారి ట్రై చేయండి.

అద్దం (Mirror):

DIY Mirror Frame Ideas: How to Frame a Mirror in 8 Steps | Architectural  Digest

బాత్‌రూమ్‌లో అద్దం కచ్చితంగా ఉండాలి. ఎట్రాక్టివ్‌ డిజైన్‌లో మీ బాత్‌రూమ్‌ అద్దం ప్లాన్‌ చేసుకుంటే లుక్‌ మారిపోతుంది. అయితే ఇందుకు ఎంపిక చేసుకునే అద్దం డిజైన్, పరిమాణం విషయంలో మాత్రం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అద్దం చుట్టూ అందమైన స్టిక్కర్స్ లేదా తీగజాతి పూలను ఎరేంజ్‌ చేస్తే.. మీ బాత్‌రూమ్‌ చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటుంది.

లైటింగ్‌ (Lighting):

Download wallpaper 1280x720 interior, bathroom, bedroom, bath, candles,  fire hd, hdv, 720p hd background

మనం బాత్‌రూమ్‌ లైటింగ్‌ విషయంలో.. అంత కేర్‌ తీసుకోం. మీ బాత్రూమ్ కాస్త విశాలంగా కనిపించాలంటే లైటింగ్‌ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. గదిలో వెలుతురు ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్దగా అనిపిస్తుంది. లీనియర్ లైటింగ్‌ని ఉపయోగించడం వల్ల ఎలిగెంట్‌ లుక్‌ వస్తుంది.

షెల్ఫ్‌లో సర్దేయండి (Place on the Shelf):

15 Practical DIY Bathroom Shelf Projects You Can Do This Weekend

చాలా మంది బాత్‌రూమ్‌లో సబ్బులు, షాంపూలు.. చిందరవందరగా పారేస్తూ ఉంటారు. ఇలా చేస్తే.. బాత్‌రూమ్‌ అసహ్యంగా కనిపిస్తుంది. మీ స్నానాల గదికి మంచి లుక్‌ ఇవ్వడానికి.. గోడకు చిన్న చిన్న షెల్ఫ్స్ ఏర్పాటుచేసి వాటి పైనే అవన్నీ అందంగా సర్దుకుంటే బాగుంటుంది.

మ్యాట్‌ (Matt):

Super Absorbent Floor Mat Review 2021- Absorbent Bath Mat - YouTube

స్నానాల గదిలో మ్యాట్‌ చాలా ముఖ్యం. ఇది అందాన్ని పెంచడమే కాకుండా ప్రభావవంతంగా కూడా ఉంటుంది. స్నానం చేసి పాదాలు తడిస్తే ఆ మరకకు ఇల్లంతా పాడైపోతుంది. అందుకే మాట్ తప్పనిసరి. మీ డోర్‌ మ్యాట్‌ చాలా ఇన్నోవేటివ్‌గా ఉండేలా.. ప్లాన్‌ చేసుకోండి.

మొక్కలతో అలంకరించండి (Decorate with Plants):

7 Feng Shui Tips To Apply In Your Bathroom - Blog

మీరు ప్రకృతి ప్రేమికులైతే.. మీ బాత్‌రూమ్‌లో మొక్కలు పెంచుకుంటే దాని లుక్‌ వెంటనే మారిపోతుంది. బాత్‌రూమ్‌లో మీరు స్పెండ్‌ చేసే టైమ్‌ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్రెష్‌ ఎయిర్‌ కూడా వస్తుంది.

Also Read:  Home Loan : గృహ రుణాలు చాలా రకాలు ఉన్నాయి.. అవేంటంటే..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bathroom
  • Hacks
  • Ideas
  • Life Style
  • tips

Related News

    Latest News

    • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

    • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

    • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

    • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

    • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd