Onions : ఉల్లిపాయలు తొందరగా చెడిపోకుండా, మొలకలు రాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ఉల్లిపాయలు కొన్ని కొన్ని సార్లు చాలా తొందరగా పాడైపోతాయి. ఉల్లిపాయలను ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా నిలువ ఉంచుకోవాలి అని చాలా మంది అనుకుంటారు.
- By News Desk Published Date - 11:00 PM, Mon - 19 June 23

ఉల్లిపాయలు(Onions)అన్ని కూరల్లో మనం వాడుకుంటూ ఉంటాము. ఉల్లిపాయ లేనిదే మన కూర రుచిగా ఉండదు. అందుకని ఉల్లిపాయలను ఎక్కువగా కొని ఉంచుకుంటాము. కానీ ఆ ఉల్లిపాయలు కొన్ని కొన్ని సార్లు చాలా తొందరగా పాడైపోతాయి. ఉల్లిపాయలను ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా నిలువ ఉంచుకోవాలి అని చాలా మంది అనుకుంటారు.
ఉల్లిపాయలను ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉంచకూడదు. చల్లని ప్రదేశంలో గాలి, వెలుతురు తగిలే విధంగా ఉల్లిపాయలను ఉంచాలి.
ఉల్లిపాయలను ఫ్రిజ్ లో నేరుగా పెట్టకూడదు ఎందుకంటే నేరుగా పెడితే అవి మెత్తబడిపోతాయి. ఉల్లిపాయలను ఫ్రిజ్ లో పెట్టాలని అనుకుంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయల పైన పొరను తీసేసి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు అలా చేసినా అవి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి.
ఉల్లిపాయలను రంధ్రాలు ఉన్న సంచులలో, బుట్టలలో ఉంచుకోవచ్చు. ప్లాస్టిక్ బ్యాగ్స్ లో ఉల్లిపాయలను పెట్టవద్దు ఎందుకంటే వాటిలో పెడితే గాలి లేక ఉల్లిపాయలు తొందరగా పాడవుతాయి.
ఉల్లిపాయలను తేమ ఎక్కువగా ఉన్న ప్రదేశంలోనూ లేదా సూర్యుని కిరణాలు నేరుగా తగిలే చోట ఉంచకూడదు అలాంటి ప్రదేశాలలో పెడితే ఉల్లిపాయలు తొందరగా పాడవుతాయి లేదా మొలకలెత్తుతాయి.
ఉల్లిపాయల్లో ఒకటి పాడైపోయింది అని అనిపిస్తే వాటిల్లోంచి ముందు అది తీసి పడేయాలి. లేదా దాని ఎఫెక్ట్ తో మిగిలిన ఉల్లిపాయలు కూడా త్వరగా పాడవుతాయి.
Also Read : Ragi Java: వామ్మో.. వేసవిలో రాగి జావ తాగడం వల్ల అన్ని రకాల ప్రయోజనాల?