Shani Dev: శని దేవుడి ముందు ఆ కోరిక కోరితేనే కరుణిస్తాడట?
చాలామంది శనీశ్వరుడి పేరు భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడి పేరుతో పాటుగా ఏలినాటి శని అష్టమ శని, అర్ధాష్టమి
- By Nakshatra Published Date - 07:30 AM, Tue - 25 October 22
చాలామంది శనీశ్వరుడి పేరు భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడి పేరుతో పాటుగా ఏలినాటి శని అష్టమ శని, అర్ధాష్టమి శని ఈ పేర్లు విన్నా కూడా వణికిపోతూ ఉంటారు. వారి జాతకంలో శని ప్రభావం ఉండకూడదు అని. అలాగే శని దోషం లాంటివి కూడా ఉండకూడదు అని కోరుకుంటూ ఉంటారు. శనీశ్వరుని చూసి భయపడే వారం ఎంతమంది ఉన్నారో అంతేమంది శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇళ్లలో శని దేవుని విగ్రహాలు ఫోటోలు ఉండవు. ఇకపోతే పురాణాల ప్రకారం శని దేవుడు ఎవరిని పై అయినా ఆ గ్రహిస్తే వారు చెడు స్థితిలో ఉండడంతో పాటు కష్టాలను ఎదుర్కొంటారు అని చెబుతూ ఉంటారు.
అంతేకాకుండా శని దేవుడుని ఎప్పుడూ కూడా శని అని పిలవకూడదు. శని దేవుని ఎప్పుడు కూడా శనీశ్వర అని మాత్రమే పిలవాలి.. అది ఆయన పేరుని తలుచుకున్నప్పుడు కూడా శనీశ్వర అనే మాత్రమే తలుచుకోవాలి. ఈశ్వర శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అయితే చాలామంది శనీశ్వరుని చూసి భయపడుతూ ఉంటారు. కానీ అలా భయపడాల్సిన పనిలేదు. ఎప్పుడైనా దేవాలయాలలో నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్కారం చేయాలి. ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి, గౌరవిస్తారో అలాంటి వాళ్లను అనుగ్రహిస్తాడు.
అయితే ఎప్పుడు కూడా శని పీడ రావాలనే కోరుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే అందుకు వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ అందిస్తాడు. కాబట్టి మీరు శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం, ఐశ్వర్యం కూడా రాదట. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీకలిగించాలని భక్తిశ్రద్ధలతో కోరుకోవడంతో పాటు శనీశ్వరుడిని ఆరాధించాలి.
Related News
Shani Dev Worship: శని దోషంతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు.. సమస్యలు పరార్!
మాములుగా చాలామంది జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి వంటి దోషాలతో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాల�