Pregnancy Diet: ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా తీసుకోవాల్సిన కూరగాయలు.. అస్సలు మిస్ చేయకండి!
Pregnancy Diet: ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పకుండా కొన్ని రకాల కూరగాయలను తీసుకోవాలని వీటి వల్ల తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:30 AM, Sat - 1 November 25
Pregnancy Diet: ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలు తప్పకుండా ఆరోగ్య విషయంలో చాలా రకాల జాగ్రత్తగా పాటించాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. తినే ఆహారం విషయంలో, చేసే పనుల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఇవి తినకూడదు, అవి తినకూడదని పెద్దలు ఎన్నో ఆంక్షలు విధిస్తుంటారు. కానీ ఈ సమయంలో కడుపులో ఉన్న బిడ్డా, తల్లీ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కొన్ని కూరగాయల్ని ఖచ్చితంగా తినాలని చెబుతున్నారు. మరి ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి కూరగాయలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చిలగడదుంపలను ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా తినాలట. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు మెండుగా ఉంటాయట. ఇవి తల్లికి అవసరమైన శక్తని అందిస్తాయని, అలాగే కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడతాయని చెబుతున్నారు. ఈ చిలగడదుంపలో ఉండే ఫోలెట్ శిశువు మెదడు అభివృద్ధికి సహాయపడుతుందట. అలాగే పుట్టుకతో వచ్చే లోపాలను నివారించేందుకు తోడ్పడుతుందని, దీనిలో ఉండే బీటా కెరోటిన్ శరీరంలో విటమిన్ ఎ గా మారి శిశువు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుందని, అలాగే రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తుందని చెబుతున్నారు. బీట్‌రూట్ లో పోషకాలు మెండుగా ఉంటాయట.
దీనిలో ఉండే విటమిన్లు, ఫైబర్ లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయని, బీట్ రూట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుందని, ఇది హిమోగ్లోబిన్ ను పెంచుతుందని చెబుతున్నారు. అలాగే అనిమియా వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందట. దీనిలో ఉండే ఫోలెట్ శిశువు మెడదు, స్పైనల్ కార్డ్ అభివృద్ధికి సహాయపడుతుందట. అంతేకాదు దీనిలో ఉండే నైట్రేట్ గర్భిణులకు హైబీపీని తగ్గిస్తుందట. బీట్ రూట్ ను తింటే రక్తం శుద్ధి అవుతుందట. ట్యాక్సిన్స్ బయటకు పోతాయని, అంతేకాదు దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ గర్భిణులకు మలబద్దకం సమస్య నుంచి బయటపడేస్తుందని,బీట్‌రూట్ లో ఉండే విటమిన్ సి, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయట.
క్యాప్సికం గర్భిణుల ఆరోగ్యానికి చాలా మంచిదట. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుందని, ఇది మలబద్దకం సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని, దీనిలో ఉండే విటమిన్ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే శరీరంలో ఐరన్ శోషణకు సహాయపడుతుందట. అలాగే ఫోలెట్ శిశువు మెదడు, నరాల వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుందట. ఈ కూరగాయలో ఉండే ఐరన్, పొటాషియం, కాల్షియం ఎముకల్ని బలంగా ఉంచడానికి శిశువు ఎదుగుదలకు తోడ్పడుతాయట. బ్రోకలీ కూడా గర్భిణులకు చాలా మంచిదట. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలెట్ వంటి ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి తల్లీ, బిడ్డను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయని, ముఖ్యంగా బ్రోకలీని తినడం వల్ల గర్భిణులకు మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని,దీనిలోని ఫోలెట్ మెదడు అభివృద్ధికి సహాయపడుతుందని చెబుతున్నారు.