Pink Lips: నల్లని పెదవులు ఎరుపు రంగులోకి మారాలి అంటే.. ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?
- By Sailaja Reddy Published Date - 01:30 PM, Thu - 22 February 24

మామూలుగా చాలామందికి పెదవులు నల్లగా ఉంటాయి. ఇంకొందరికి పింక్ కలర్ లో ఉంటాయి. బ్లాక్ కలర్ లిప్స్ ఉండేవారు పింక్ కలర్ లిప్స్ కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లు,హోమ్ రెమిడీలు, వంటింటి చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా లిప్స్ బ్లాక్ కలర్ లోనే ఉంటాయి. అయితే అలాంటప్పుడు తప్పనిసరిగా ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఆ చిట్కాలు ఏంటి అన్న విషయాన్ని వస్తే.. సాధారణంగా పెదవులు నల్లగా మారడానికి చాలా కారణాలు ఉండవచ్చు. ఎక్కువ కాలం స్మోకింగ్ చేసిన వాళ్ళ పదవులు కూడా నల్లగా అయిపోతాయి.
అలానే పెదవులు పదే పదే తడపడం వల్ల కూడా డార్క్‌గా అయిపోతూ ఉంటాయి. అయితే ఇలా పెదవులు నల్లబడి పోవడంని హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. ఎక్కువ మెలోనిన్ వల్ల ఈ సమస్య వస్తుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్య ఉన్న వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలు పెదాలు ఎరుపు రంగులోకి మారడం ఖాయం. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. మీరు మీ పెదవులకు లిప్ బామ్ రాసేటప్పుడు దానిలో ఎస్పీఎఫ్ 30 ఉండేటట్లు చూసుకోవాలి. దీని వల్ల మీ పెదవులు నల్లగా మారవు. అందంగా, ఎర్రగా ఉంటాయి.
కాబట్టి లిప్ బామ్ కొనేటప్పుడు ఎస్పీఎఫ్ 30 వుండే వాటిని కొనుగోలు చేయాలి. దీనిని మీరు రెగ్యులర్‌గా వాడడం వల్ల మీ పెదవులు అందంగా మెరుస్తాయి. పెదవులపై ఉన్న నల్లతనం పూర్తిగా తొలగిపోతుంది. అదే విధంగా ఈ చిట్కా కూడా మీకు బాగా పని చేస్తుంది. మీ పెదవులకు విటమిన్ ఈ అప్లై చేయాలి. దీని వల్ల అందంగా ఉండే పెదవులు మీ సొంతం అవుతాయి. మీ పెదవులు అందంగా ఉండాలంటే తప్పకుండా కెఫిన్‌కి దూరంగా ఉండండి. ఎక్కువగా కెఫీన్‌ని తీసుకునే వారిలో పెదవులు నల్లగా ఉంటాయి. కాబట్టి కేఫిన్ ని తక్కువగా తీసుకోవాలి. రెగ్యులర్‌గా లిప్ స్టిక్‌ని వాడేటప్పుడు బయటికి వెళ్లి వచ్చిన వెంటనే దానిని రిమూవ్ చేయాలి. దీని కోసం మీరు ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌ని మీరు వాడవచ్చు. ఇలా వీరితో తొలగించడం వల్ల మీ పెదవులు నల్లబడకుండా ఉంటాయి. చాలా మందికి పెదాల్ని తడిపే అలవాటు ఉంటుంది. ఆస్తమాను మీరు మీ పెదవులు తడపడం వల్ల పెదవులు నల్లగా మారిపోతాయి. మీకు కనుక ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది తద్వారా పెదవులు అందంగా ఉంటాయి.