Diet Soda Drinks : ‘డైట్ సోడా’ అతిగా తాగారో.. ఎంతో రిస్క్!
Diet Soda Drinks : డైట్ సోడాలు.. వీటిలో జీరోషుగర్, జీరో క్యాలరీ ఉంటుంది. ఇవి కార్బోనేటేడ్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు !!
- By Pasha Published Date - 05:27 PM, Tue - 12 December 23
Diet Soda Drinks : డైట్ సోడాలు.. వీటిలో జీరోషుగర్, జీరో క్యాలరీ ఉంటుంది. ఇవి కార్బోనేటేడ్, నాన్ ఆల్కహాలిక్ పానీయాలు !! వీటిని అధికంగా తీసుకుంటే ఊబకాయం, ఆందోళన, టైప్ 2 మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి ప్రాబ్లమ్స్ పెరిగే రిస్క్ ఉంటుంది. శరీరంలోని కొవ్వును తగ్గించడానికి నాన్ షుగర్ స్వీటెనర్లను ఉపయోగించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది మార్చిలో కొత్త మార్గదర్శకం జారీ చేసింది. డైట్ సోడాలు శరీర కొవ్వు, రక్తపోటు స్థాయులను పెంచేస్తాయని ఇంకొన్ని పరిశోధనా నివేదికలు పేర్కొన్నాయి. డైట్ సోడాలను మితిమీరి వినియోగిస్తే వాస్కులర్ ఈవెంట్స్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుందని వెల్లడించాయి. డైట్ సోడాల వల్ల కాలేయానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కాలేయంలో ఇన్సులిన్ నిరోధకత, వాపు పెరుగుతాయి.కాలేయంలో అధిక కొవ్వు చేరడం వల్ల మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలేయ వ్యాధి ప్రపంచ జనాభాలోని 46 శాతం మందిని ప్రభావితం చేస్తోందని అంచనా వేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
- న్యూరాలజీ అమెరికన్ అకాడమీ చేసిన ఒక అధ్యయనంలో 10 సంవత్సరాలుగా రోజుకు నాలుగు లేదా ఎక్కువ డైట్ సోడాలను(Diet Soda Drinks) తాగిన వ్యక్తులలో తాగని వారి కంటే 30 శాతం ఎక్కువ మానసిక వ్యాకులత వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు.
- డైట్ సోడాలోని ఆమ్ల కార్బోనేషన్ యొక్క ప్రభావాలు మీ నవ్వును నాశనం చేస్తాయి. డైట్ సోడా తాగే వారి దంతాలకు నష్టం వాటిల్లుతుందని కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు.
- మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయన నివేదిక ప్రకారం.. రోజుకు ఒక డైట్ సోడా తాగే వారిలో టైప్ 2 షుగర్, జీవక్రియలు గాడితప్పే రిస్క్ 36 శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గ్లూకోజ్ లెవల్స్ పెరగడం, కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగడం, అధిక రక్తపోటు పెరగడం వంటివి జరుగుతాయి.
Also Read: Hair Tips: శీతాకాలంలో చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?
Related News
Soda Effects: రోజూ సోడా తాగితే ఏమవుతుంది ? తెలుసుకోండి
సోడా అధికంగా తాగడం వల్ల బరువు సులువుగా పెరుగుతారు. వీటిలో అధికంగా చక్కెర కలిపి ఉంటుంది. అలాగే ఫ్రక్టోజ్ సిరప్ కూడా నిండి ఉంటుంది. ఎలాంటి పోషక విలువలు ఉండవు.