Hair Tips: శీతాకాలంలో చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే?
చాలామంది చలికాలంలో చుండ్రు సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్యల్లో చుండ్రు ఒకటి. అయితే ఈ చుండ్రుకు కా
- Author : Anshu
Date : 12-12-2023 - 4:47 IST
Published By : Hashtagu Telugu Desk
చాలామంది చలికాలంలో చుండ్రు సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్యల్లో చుండ్రు ఒకటి. అయితే ఈ చుండ్రుకు కారణం వాతావరణం లో మార్పులు, పోషకాహార లేని ఇంకా ఎన్నో కారణాల వల్ల వస్తూ ఉంటుంది. దీనివల్ల నలుగురిలో తిరగడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలామంది చుండ్రులు తగ్గించుకోవడం కోసం గాడత ఎక్కువ ఉన్న షాంపూలను అలాగే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే జుట్టుకు ఏది పడితే అవి వాడటం వల్ల రెండు సమస్య తగ్గడం పక్కన పెడితే హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది.
అందుకే చుండ్రును తగ్గించుకోవడానికి సహజమైన పద్ధతులను వాడాలి. మరి చలికాలంలో చుండ్రు నుంచి బయటపడటం కోసం కొన్ని సులువమైన చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఒత్తిడి మీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలహీన పరుస్తూ ఉంటుంది. చుండ్రుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ లతో పోరాడే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గేలా చేస్తుంది. కావున ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి వీలైనంతవరకు ఎక్ససైజ్, నడక, యోగ లాంటి వాటిని మీ జీవనశైలిలో ఒక భాగంగా మార్చుకోవాలి. అలాగే చలికాలంలో వేపరసం జుట్టు ఎదుగుదలను మెరుగుపడేలా చేస్తుంది. అలాగే చుండ్రు మీద బాగా ప్రభావం చూపుతుంది. స్కాల్ప్ మీద మూసుకుపోయిన రంధ్రాలను శుభ్రపరచడంలో ఉపయోగపడుతుంది.
వేపరసం లోని పోషకాలు చుండ్రులు తగ్గించడంలో గొప్పగా పనిచేస్తాయి. దీనికోసం వేపాకులు పేస్టులా చేసి తలకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. అదేవిధంగా ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చుండ్రును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పెరుగు చాలా ఉపయోగపరంగా ఉంటుంది. కావున పెరుగులో రెండు చెంచాల ఉసిరి పొడిని కలిపి దీనిని తలకి బాగా అప్లై చేసుకోవాలి. అలా ఒక 45 నిమిషాలు ఉంచుకొని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.