Coconut Water Side Effects: కొబ్బరి నీళ్ల తాగుతే లాభాలే కాదు..నష్టాలు కూడా ఉన్నాయి…!!
కొబ్బరి నీళ్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. తక్కువ కేలరీలు, పొటాషియం, మినరల్ కంటెంట్ కారణంగా ఇది ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణిస్తారు.
- By hashtagu Published Date - 06:43 PM, Sat - 8 October 22
కొబ్బరి నీళ్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. తక్కువ కేలరీలు, పొటాషియం, మినరల్ కంటెంట్ కారణంగా ఇది ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణిస్తారు. అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా ప్రతి ఒక్కరూ కొబ్బరినీళ్లు తాగాడానికి ఇష్టపడుతుంటారు. వీటి రుచి తియ్యాగా ఉండటంతో త్రాగడానికి ఇష్టపడతారు. జుట్టు, చర్మం కళ్ళకు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లతో ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలను ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లతో నష్టాలు
ఊబకాయం :
కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల బరువు తగ్గుతుందని మీరు వినే ఉంటారు. కానీ అది పరిమిత పరిమాణంలో తీసుకుంటే మీ బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ డ్రింక్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
రక్తపోటు:
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కాబట్టి అధిక రక్తపోటుకు మందులు వాడే రోగులు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండటం మంచిది.
జలుబు:
జలుబు సమస్య ఉంటే కొబ్బరి నీళ్లు తాగకూడదు. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మిమ్మల్ని మరింత అనారోగ్యానికి గురి చేస్తుంది.
లూజ్ మోషన్ :
కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. దీంతో మీకు లూజ్ మోషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సర్జరీ :
మీకు ఏదైనా శస్త్రచికిత్స జరిగితే, కొబ్బరి నీళ్ళు తాగడం మానుకోండి. వైద్యుడిని సంప్రదించకుండా వీటిని తాగకూడదు. వాస్తవానికి, శస్త్రచికిత్స తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే రక్తపోటును నియంత్రించడంలో సమస్యలను కలిగిస్తుంది.
ప్రయోజనాలు
– ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. లారిక్ యాసిడ్ ఈ డ్రింక్‌లో ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు జీవక్రియను పెంచుతుంది.
– జిమ్ ట్రైనర్స్ వ్యాయామం తర్వాత కొబ్బరినీళ్లు తాగాలని సిఫార్సు చేస్తారు. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. వ్యాయామం తర్వాత మీరు అలసిపోయినట్లు అనిపిస్తే, కొబ్బరి నీళ్లు తాగినట్లయితే అలసటను తొలగిస్తుంది.
– కొబ్బరి నీళ్ల నుండి వచ్చే సువాసన మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు రాత్రి పడుకునే ముందు వీటిని తాగవచ్చు. దీంతో ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
Related News
Calcium Carbide: కాల్షియం కార్బైడ్ అంటే ఏమిటి..? దానితో పండిన మామిడి ఆరోగ్యానికి ఎందుకు హానికరం?
మార్కెట్లోకి మామిడికాయల రాక ఎప్పుడో మొదలైంది. అయితే ఈ రోజుల్లో మార్కెట్లో వస్తున్న మామిడిపండ్లు రసాయనాలతో పండినవే.