Tomato Benefits: టమోటో తొక్కే కదాని తీసిపారేయకండి…దీని ప్రయోజనాలు తెలుస్తే షాక్ అవుతారు..!!
టమోటోలేని కూర చేయడం చాలా కష్టం. దాదాపు అన్ని రకాల కూరగాయలతో చేసే వంటల్లో టమోటోను వాడుతుంటాం.
- By Hashtag U Published Date - 09:20 AM, Sun - 29 May 22

టమోటోలేని కూర చేయడం చాలా కష్టం. దాదాపు అన్ని రకాల కూరగాయలతో చేసే వంటల్లో టమోటోను వాడుతుంటాం. ఇది కూరలను రుచిగా చేస్తుంది. అందుకే టమోటో లేని కూర ఊహించడం కష్టం. కానీ కొన్ని రకాల కూరలు చేసేటప్పుడు తొక్కను తీసేస్తుంటారు. ఆ తొక్కే మనకు ఎంతో మేల చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకు టమోటో తొక్క చేసే సాయం ఎంటో తెలుసుకుందాం.
తొక్కలో పోషకాలు:
టమోటో తొక్కలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందలో కెరోటినాయిడ్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా టమాటాలల్లో ఉండే ఫ్లేవనాల్స్ టమోటాలలో కంటే టమోటా తొక్కలోనే ఎక్కువగా లభిస్తాయి.
చర్మానికి:
పనాసియా టొమాటో తొక్కలు మీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది చర్మ రంధ్రాలు, బ్లాక్ హెడ్స్ ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. దీనికోసం టొమాటో తొక్కలను ఎండబెట్టి, ఆ తర్వాత దాని పొడిని తయారు చేయాలి. ఆ పొడిలో రోజ్ వాటర్ లేదా నార్మల్ నీటితో మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది.
జిడ్డు చర్మం:
ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఇది చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. టొమాటో తొక్కలు ముఖంపై పేరుకుపోయిన ఆయిల్ ను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. టొమాటో తొక్కలను ముఖంపై బాగా రుద్ది 10-15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగాలి. ఇలా చేస్తే మీ ముఖం ఆయిల్ ఫ్రీగా కనిపిస్తుంది.
ఇక టమోటో సూప్ ల నుంచి టొమాటో సాస్ లను తయారు చేయడానికి టమాటోలనే కాదు.. టొమాటో తొక్కలను కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం టొమాటో తొక్కలను ఎండబెట్టి, ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీరను వేసి పేస్ట్ లా చేసుకోవాలి. మీరు ఈ పేస్ట్ ను సూప్, సాస్ లేదా పిజ్జా సాస్ గా ఉపయోగించవచ్చు.
టమోటా పౌడర్ తయారు చేసే పద్దతి:
మార్కెట్ లో టమోటో పౌడర్ కు చాలా ధర ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో టమోటా తొక్కలతో మీరు ఇంట్లోనే పౌడర్ తయారు చేసుకోవచ్చు. టొమాటో పొడి ఏదైనా మ్యారినేట్ చేయడానికి లేదా సలాడ్ కు కూడా జోడించొచ్చు. టొమాటో తొక్కలను ఎండబెట్టి పొడిలా తయారు చేయాలి. గార్నిష్ నుంచి గ్రేవీని చిక్కగా చేయడానికి ఈ టొమాటో పొడిని ఉపయోగించవచ్చు.
అంతేకాదు…తుప్పు పట్టిన పాత్రలను శుభ్రం చేయడానికి తొక్కలను ఉపయోగించవచ్చు. మురికిగా లేదా మరకలు పడిన ప్రదేశంలో రుద్ది కాసేపు అలాగే ఉంచాలి. కొద్దిగా ఫుడ్ సోడాను కూడా జోడించవచ్చు. ఇది తుప్పు గుర్తులు, సింక్ మీద నల్లటి మచ్చల వరకు అన్నింటినీ తొలగిచేస్తుంది.