Health : విటమిన్ సి ..ఆరోగ్యానికి ఎందుకు మంచిదో తెలుసా..?
ఆధునిక కాలంలో ఆరోగ్యంగా ఉండటం ఒక సవాలు. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి.
- By hashtagu Published Date - 07:13 PM, Sun - 2 October 22

ఆధునిక కాలంలో ఆరోగ్యంగా ఉండటం ఒక సవాలు. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పోషకాలలో ఏదైనా ఒకటి లోపించిందంటే…ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా విటమిన్ సి లేనట్లయితే రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. అంతేకాదు చర్మ సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవల్సి ఉంటుంది. దీని కోసం విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నారింజ, ఉసిరి, క్యాప్సికం, చింతపండు వీటిల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకోవాలి. సీ విటమిన్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం మెరుస్తుంది. అలాగే చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. విటమిన్ సి ముఖానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
హైపర్పిగ్మెంటేషన్‌లో ఉపశమనం:
హైపర్‌పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్న వ్యక్తి ముఖంపై నల్లటి మచ్చలు వస్తాయి. దీనితో పాటు, చర్మం రంగు కొన్ని చోట్ల నల్లగా మారుతుంది. కొందరి ముఖంపై మచ్చలు, మరికొందరి ముఖంపై పెద్దగా మచ్చలు ఏర్పడతాయి. మీరు హైపర్పిగ్మెంటేషన్ సమస్యతో కూడా ఇబ్బంది పడుతుంటే, ఖచ్చితంగా విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
కొల్లాజెన్‌ని పెంచుతుంది:
కొల్లాజెన్ అనేది శరీరంలో కనిపించే ఒక రకమైన ప్రోటీన్. ఇది ఎముక, చర్మం, కండరాలలో ప్రధాన భాగం. దీని ప్రధాన విధి చర్మానికి బలాన్ని అందించడం. దీని కోసం కొల్లాజెన్‌ను పెంచడం చాలా ముఖ్యం. శరీరంలో కొల్లాజెన్ లేకపోవడం వల్ల ముఖంపై ముడతలు వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి, మీ ఆహారంలో విటమిన్ సి ఉన్న వాటిని ఖచ్చితంగా చేర్చుకోండి.
రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది:
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఆహారంలో విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మారుతున్న సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.