Cucumber: చలికాలంలో కీర దోసకాయ తినాలంటున్న నిపుణులు.. ఎందుకో తెలుసా?
Cucumber: చలికాలంలో దగ్గు జలుబు సమస్య వస్తుంది అని కీర దోసకాయ తినకుండా ఉండేవారు తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ముఖ్యంగా చలికాలంలో కీరా తప్పకుండా తినాలనీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- Author : Anshu
Date : 15-12-2025 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Cucumber: కీర దోసకాయ.. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరు ఇష్టపడే వెజిటేబుల్. ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగించే కీరా దోసకాయను పచ్చిగానే తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. అలాగే కీరనీ ఉపయోగించి కొన్ని రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. కాగా కీర దోసకాయను పోషకాల గని అని కూడా అంటారు. నిజానికి కీరదోసకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. అయినప్పటికీ కీరా దోసకాయను తినడం ద్వారా శరీరం హైడ్రేట్ అవుతుందనీ, అలాగే బరువు తగ్గడానికి కూడా కీరా దోసకాయ అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
కీర దోసకాయలను సలాడ్స్, శాండ్‌విచ్‌లతో ఎక్కువగా తింటారు.
అయితే కీరా దోసకాయను సవికాలంలో తీసుకోవడం సహజమే. కానీ చలికాలంలో కూడా కీరా దోసకాయలను తినాలని, తద్వారా మీ శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు లభిస్తాయని డైటీషియన్లు చెబుతున్నారు. మీ శీతాకాలపు డైట్ లో కీర దోసకాయను ఎందుకు జోడించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కీర దోసకాయ వల్ల జీర్ణ ప్రక్రియకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కీర దోసకాయలలో కరిగే ఫైబర్ మన జీర్ణక్రియకు చాలా సహాయపడుతుందట. కీర దోసకాయలలో ఉండే అధిక నీటి కంటెంట్ మలబద్ధకాన్ని నివారిస్తుందని, పేగు కదలికలకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. అలాగే ఇవి మీ చర్మ సౌందర్యాన్ని పెంచేందుకు చాలా ఉపయోగపడతాయట.
కీర దోసకాయ రసాన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుందట. కీర దోసకాయలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మన చర్మాన్ని సహజంగా కాంతివంతం చేస్తాయని చెబుతున్నారు. కీర దోసకాయలు డైటరీ ఫైబర్, మెగ్నీషియం పొటాషియం అద్భుతమైన మూలం. ఈ పోషకాలు రక్తపోటును తగ్గిస్తాయట. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. కీర దోసకాయలలో సిలికా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టుకు చాలా మంచిదని, మీ వెంట్రుకలను కుదుళ్ల నుంచి బలం చేకూర్చడంలో కీర దోసకాయలు సహాయపడతాయని చెబుతున్నారు. కీర దోసకాయ మీ శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుందట. ముఖ్యంగా శీతాకాలంలో దాహం వేయక పోవడం వల్ల తక్కువగా నీటిని తాగుతూ ఉంటారు. దీని కారణంగా శరీరం డిహైడ్రేషన్ కు గురవుతుందట. ఇలాంటి సమయంలో కీరా దోసకాయలు తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేట్ అవుతుందని చెబుతున్నారు. కీర దోసకాయలు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయట. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కీర దోసకాయలు ఎక్కువగా తినడం వల్ల ఆకలి అవ్వదట తద్వారా బరువు పెరగరని నిపుణులు చెబుతున్నారు. కీర దోసకాయలు రక్తంలో చక్కెరను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయట.