Making of Sabudana : శరీరానికి చలువ చేసే.. సగ్గుబియ్యంను ఎలా తయారు చేస్తారో తెలుసా ?
భూమిలో పెరిగే దుంప కర్రపెండలంతో సగ్గుబియ్యంను తయారు చేస్తారు. కర్రపెండలాన్ని భూమిలో నుంచి తీయగానే.. అది తాజాగా ఉన్నప్పుడే సగ్గుబియ్యం తయారు చేస్తారు.
- By News Desk Published Date - 10:09 PM, Mon - 18 March 24
Making of Sabudana : సగ్గుబియ్యం.. వీటితో పాయసం చేసుకుని తింటే శరీరానికి చాలా మంచిది. చలువ చేస్తుంది. ఎప్పుడైనా సగ్గుబియ్యంను పరిశీలనగా చూశారా? ఎవరో చేతులతో గుండ్రంగా చుట్టినట్లు, ఎలాంటి వంకర్లు లేకుండా ఉంటాయి. వీటిని చూస్తే ఎవరికైనా ముత్యాలే గుర్తొస్తాయి. సగ్గుబియ్యంతో పాయసం, జావ మాత్రమే కాదు. రకరకాల వంటలు చేసుకోవచ్చు. వేసవిలో సగ్గుబియ్యంతో వడియాలు చేసుకుని నిల్వచేసుకుంటారు కూడా. మరి ఈ సగ్గుబియ్యాన్ని ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా ? ఇప్పుడు తెలుసుకోండి.
భూమిలో పెరిగే దుంప కర్రపెండలంతో సగ్గుబియ్యంను తయారు చేస్తారు. కర్రపెండలాన్ని భూమిలో నుంచి తీయగానే.. అది తాజాగా ఉన్నప్పుడే సగ్గుబియ్యం తయారు చేస్తారు. భూమిలో నుంచి వాటిని తీసిన 24 గంటలలోపే సగ్గుబియ్యం తయారీ కేంద్రానికి పంపించి వాటిని తయారు చేయడం ప్రారంభిస్తారు. యంత్రంలో కర్రపెండలం వేయగానే దాని తొక్కను తీసేస్తాయి. క్రషర్ లో వేసి వాటి నుంచి పాలను వేరుచేస్తారు. ఈ పాలను ఫిల్టరింగ్ మిషన్ లో వేయగా.. అవి ఫిల్టరై చివరికి తెల్లని పదార్థంలా బయటికి వస్తుంది. ఆ తెల్లని పదార్థాన్ని జల్లెడలో వేసి అటూ ఇటూ తిప్పుతారు. ఈ క్రమంలో జల్లెడలోని రంధ్రాల నుంచి ఆ ముద్ద గుండ్రపు గింజల్లా కిందపడతాయి. వాటిని ఎండల్లో పెట్టి గట్టిపడేలా చేస్తారు. అంతే సగ్గుబియ్యం రెడీ.
కిలో సగ్గుబియ్యం కావాలంటే.. 5 కిలోల దుంపలు అవసరమవుతాయి. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో దీనిని ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. మనకు అన్నం ఎలాగో.. అక్కడ సగ్గుబియ్యం అలా జావగా చేసుకుని తాగుతారు. ఐస్ క్రీమ్ కోన్ తయారీదారులు కూడా ఈ కర్ర పెండలాన్ని వినియోగిస్తారు. రబ్బర్, వస్త్ర, మసాలా పౌడర్, కాస్మోటిక్స్, సబ్బులు, ఫార్మాస్యూటికల్స్, కాగితం తయారీదారులు కూడా కర్రపెండలాన్ని వినియోగిస్తారు.
సగ్గుబియ్యంలో ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్ లభిస్తాయి. హైబీపీ ఉన్నవారు సగ్గుబియ్యం తింటే మంచిది. బీపీ కంట్రోల్ లో ఉన్నాయి. ఇందులో ఉండే ఫోలేట్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Also Read : Mango: మామిడి పండుతో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండిలా?
Related News
Saggubiyyam Kheer: సగ్గుబియ్యం ఖీర్.. ఈ విధంగా చేస్తే చాలు కప్పు మొత్తం ఖాళీ అవ్వాల్సిందే?
మామూలుగా చాలామంది స్వీట్ తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే స్వీట్ ఐటమ్స్ లో ఎప్పుడూ తినే ఐటమ్స్ మాత్రమే కాకుండా అప్పుడప్