Mango: మామిడి పండుతో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోండిలా?
మాములుగా మనకు వేసవికాలంలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఈ మామిడిపండును చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి
- By Nakshatra Published Date - 09:15 PM, Mon - 18 March 24
మాములుగా మనకు వేసవికాలంలో మామిడి పండ్లు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఈ మామిడిపండును చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే, మామిడి పండ్లను తింటే గడ్డలు వస్తాయని, వేడి చేస్తాయని చాలామంది భయపడతారు. అయితే, వాటి కోసం మీరు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామిడి పండ్లను అదేపనిగా అతిగా తినేవారికి మాత్రమే ఆ సమస్యలు వస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు కాయలు చొప్పున తినేవారికి ఎలాంటి సమస్య ఉండదు.
పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా. ఈ వేసవిలో మీ అందం, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవాలంటే తప్పకుండా మామిడి పండ్లను తినాల్సిందే. మామిడి పండుతో ఏమి చేస్తే మెరిసే చర్మం సందర్భంగా మీ సొంతం అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను తొలగించడానికి మామిడి పండ్లు ఉపయోగపడతాయి. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను తట్టుకొనే సామర్థ్యాన్ని మామిడి పండ్లు అందిస్తాయి. మామిడి పండ్లలో ఉండే విటమిన్ బి 6 చర్మంలోని సెబమ్‌ను తగ్గిస్తుంది. మామిడి పండ్లలోని పొటాషియం చర్మానికి తేమ అందిస్తుంది.
మామిడి పండ్లలోని మెగ్నీషియం మొటిమలు, చర్మం జిడ్డును తగ్గిస్తుంది. మామిడి పండ్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు నోరాటిరియోల్, రెస్వెరాట్రాల్, మాంగిఫెరిన్, క్వెర్సెటిన్లు UV కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. మామిడి పండ్లను స్కిన్ మాస్క్‌లా ముఖానికి రాసుకుంటే మొటిమల వల్ల కలిగే మంట తగ్గుతుంది. మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అవి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి. మామిడిలో ఉండే విటమిన్ సి , ఫైబర్ శరీరానికి హాని చేసే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలను మామిడి పండ్లు దూరం చేస్తాయి. బరువు పెరగాలంటే తప్పకుండా మామిడి పండ్లను తినాలి. మామిడి పండ్లలో ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మామిడి పండ్లు మంచి ఔషదం కూడా. మామిడి పండ్లలో ఉండే కాపర్ వల్ల ఎర్ర రక్తకణాల వృద్ధి చెందుతాయి.
మీకు పంటి సమస్యలు ఉంటే తప్పకుండా మామిడి పండును తినాలి. చిగుళ్ల నుంచి రక్తం కారడం, బ్యాక్టీరియ వంటి సమస్యల తొలగిపోతాయి. పైగా దంతాలపై ఉండే ఎనామిల్ బలోపేతం అవుతుంది. మామిడి పండులో రోగనిరోధక శక్తిని పెంచే బిటాకెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. కరోనా సీజన్లో రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. మామిడి పండ్లలో విటమిన్ సి తో పాటు విటమిన్ A, విటమిన్ బి6, విటమిన్ K, ప్రోటీన్, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు దరి చేరవు. మామిడి పండ్లను తినడం శృంగార వాంఛలు పెరుగుతాయి. మామిడి వల్ల జుట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.
Related News
Benefits of Mango Seed: మామిడికాయే కాదు.. గింజలు కూడా ప్రయోజనమే..!
వేసవి కాలం ప్రారంభం కావడంతో మార్కెట్లోకి మామిడికాయల రాక మొదలైంది. మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.