Laziness : రోజు బద్దకంగా ఉండి ఏ పని చేయాలని అనిపించడం లేదా? అయితే ఈ పండ్లు తినండి..
బద్దకాన్ని పోగొట్టుకోవాలంటే కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవాలి.
- By News Desk Published Date - 05:36 PM, Sun - 4 May 25

Laziness : కొంతమంది ఏ పని చేయకుండా ఫోన్ చూస్తూ కూర్చోవడం లేదా నిద్రపోవడం వంటివి చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి వాళ్ళు బాగా పెరిగిపోయారు. ముఖ్యంగా యూత్. దానివల్ల బద్ధకం కూడా బాగా పెరిగిపోయి పని చేయడంపై ఆసక్తి రావట్లేదు. ఇలాంటి బద్దకాన్ని పోగొట్టుకోవాలంటే కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవాలి. మనం చురుకుగా ఎంతో ఉత్సాహంగా మన పనులు మనం చేసుకోవడానికి మనం రోజు తినే ఆహారంలో కొన్ని పండ్లను ఖచ్చితంగా తినాలి. అప్పుడే మనకు బద్దకం అనేది తగ్గుతుంది.
బెర్రీలలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన భావాలను మారుస్తాయి. మనలోని బద్దకాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. మనం చురుకుగా పని చేసుకునేలా చేస్తాయి.
చెర్రీ పండు లోని మెలటోనిన్ అనే పదార్ధం మనకు మంచి నిద్రను కలిగిస్తుంది. దాని వలన మనకు ప్రశాంతంగా ఉండి మన మెదడు చురుకుగా ఉంటుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు అంటే ఆరెంజ్ లాంటివి తినడం వలన మనకు ఉత్సాహంగా ఉండి మన మెదడు చురుకుగా పనిచేసి మనలోని బద్దకం పోతుంది.
ఫ్రూట్ జామ్ మరియు జెల్లీలు తినడం వలన వాటిలోని కార్బోహైడ్రాట్స్ మనకు వెంటనే శక్తిని ఇస్తాయి. దీని వలన మనం చురుకుగా పని చేస్తాము.
అలాగే మనం ప్రశాంతంగా నిద్ర పోవడం వలన కూడా మనకు బద్దకం పోయి చురుకుదనం వస్తుంది. కాబట్టి మనం రోజుకు కనీసం ఎనిమిది గంటలు తప్పకుండా పడుకోవాలి, అప్పుడే మనం చురుకుగా పని చేసుకోగలుగుతాము.
Also Read : Thotakura : తోటకూర తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?