Thotakura : తోటకూర తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?
తోటకూర తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..
- By News Desk Published Date - 05:33 PM, Sun - 4 May 25

Thotakura : పచ్చని ఆకుకూరలు, కూరగాయలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర, మెంతికూర, బచ్చలికూర.. ఇలా అనేక రకాల ఆకుకూరలు ఉన్నాయి. వాటిల్లో తోటకూర ఒకటి. కానీ తోటకూరని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. తోటకూరలోనే అన్ని రకాల విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. అందుకని తోటకూరను పోషకాల గని అని పిలుస్తారు.
తోటకూర తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే..
* తోటకూర తినడం వలన అది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
* తోటకూరలో ఉండే టోకోటిరెనాల్స్ అనే విటమిన్ మన మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తుంది.
* తోటకూర తినడం వలన అది మన రక్తంలో చెక్కర స్థాయిని తగ్గిస్తుంది. టైపు- 2 షుగర్ ఉన్నవారికి తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది.
* తోటకూర తినడం వలన అది మన శరీరానికి కావలసిన కాల్షియం అందిస్తుంది. అది మన ఎముకలు దృడంగా అయ్యేలా చేస్తుంది.
* గర్భిణీ స్త్రీలు, బాలింతలు తోటకూర తింటే వారికి తగినంత ఐరన్ లభిస్తుంది.
* తోటకూరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* తోటకూర తినడం వలన అధిక రక్తపోటుని తగ్గిస్తుంది.
* తోటకూరలో ఉండే సోడియం, ఫాస్ఫరస్ రక్తనాళాలు చురుగ్గా పనిచేసేలా చేసి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
* తోటకూర జ్యూస్ తయారుచేసి దానిని మన జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి కాసేపటి తరువాత తలస్నానం చేయాలి ఇలా చేయడం వలన అది మన తలలో చుండ్రును తగ్గించి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.