Kitchen Tips : వంటగదుల్లో.. వంట సామాన్లలో.. పురుగులు, చీమలకు చెక్
Kitchen Tips : వంటగదుల్లో.. వంట సామాన్ల పెట్టెల చుట్టూ.. చీమలు, పురుగులు నిత్యం చక్కర్లు కొడుతుండటాన్ని మనం చూస్తుంటాం.
- By Pasha Published Date - 06:34 PM, Wed - 8 November 23
Kitchen Tips : వంటగదుల్లో.. వంట సామాన్ల పెట్టెల చుట్టూ.. చీమలు, పురుగులు నిత్యం చక్కర్లు కొడుతుండటాన్ని మనం చూస్తుంటాం. వాటిని ఎలా పారదోలాలి ? ఏం చేయాలి ? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
We’re now on WhatsApp. Click to Join.
- పప్పులు, బియ్యం వంటి గింజల్లో బేకింగ్ సోడాను కలిపితే చీమలు, ఇతర కీటకాలు వాటి దరికి చేరవు. ఒకవేళ ఇలా చేస్తే.. వాటిని వాడే ముందు తప్పకుండా నీటితో కడగాలి.
- కాటన్ను వెనిగర్లో ముంచి వంటగదిలో అక్కడొకటి అక్కడొకటి పడేస్తే.. వాటి నుంచి రిలీజయ్యే ఘాటు వాసనకు చీమలు, కీటకాలు ఆ వైపు రావడానికి జంకుతాయి.
- పప్పులు, బియ్యం, నట్స్కు చీమలు, పురుగులు పట్టకూడదంటే.. వాటిలో బిర్యానీ ఆకులు వేయండి. ఆ ఆకుల ఘాటు వాసనకు చీమలు, పురుగులు దరిచేరవు.
- తేనెకు చీమలు పట్టకూడదంటే.. అందులో లవంగాలు వేయొచ్చు. ఇక తేనె డబ్బా మూత చుట్టూ వాసెలిన్ రాయాలి. దీనివల్ల మూత భాగంలోకి చీమలు చేరవు.
- బియ్యం పిండి, గోధుమ పిండికి పురుగులు పట్టొద్దంటే.. వాటిలో మిరియాలు, దాల్చిన చెక్క వేయాలి.
- పంచదారకు చీమలు పట్టడం సహజం. చక్కెర ఉంచిన డబ్బాలో దాల్చిన చెక్క వేస్తే చీమలు, పురుగులు దానిలోకి(Kitchen Tips) ప్రవేశించవు.
Related News
Vegetables: ఫ్రిజ్ లేకుండా కూరగాయలు, పండ్లను తాజాగా ఉంచడం ఎలా.?
వేసవిలో పండ్లు, కూరగాయల తాజాదనం వేసవిలో త్వరగా పాడైపోతుంది. అందుకే వాటిని ఫ్రిజ్లో భద్రపరచడం తప్పనిసరి. అయితే, ఫ్రిజ్లో తినడం అంత ఆరోగ్యకరం కాదు.