Kaun Banega Crorepati 15 : కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాం లో పుష్ప కు సంబదించిన ప్రశ్న
హీరో డ్యాన్స్ చేస్తూ చెప్పు వదిలేసినా సీన్ కూడా.. ఇంతలా వైరల్ కావడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి చూశా
- Author : Sudheer
Date : 08-11-2023 - 6:32 IST
Published By : Hashtagu Telugu Desk
పుష్ప(Pushpa)..ఈ పేరు చెప్పగానే తగ్గేదేలే అనే డైలాగ్ గుర్తుకొస్తుంది..అంతలా ఫేమస్. అల్లు అర్జున్ (Allu Arjun)- సుకుమార్ (Sukumar) కలయికలో తెరకెక్కిన ఈ మూవీ..పాన్ ఇండియా గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు ఏకంగా బన్నీ కి జాతీయ అవార్డు ను తెచ్చిపెట్టింది. అలాంటి ఈ మూవీ విడుదలై దాదాపు 2 ఏళ్లు కావొస్తున్నా ఇంకా ఈ మూవీ గురించి అంత మాట్లాడుకుంటున్నారు. తాజాగా బిగ్ బి (Amitabh Bachchan) హోస్ట్ గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) షో లో పుష్ప కు సంబదించిన ప్రశ్న వేసి..మరోసారి పుష్ప ను మరోసారి వార్తల్లో నిలిచేలా చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే 14 సీజన్లు సుక్స్స్ ఫుల్ గా పూర్తి కాగా..తాజాగా 15 వ సీజన్ మొదలైంది. తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్న వేశాడు అమితాబ్. ఈ సందర్భంగా పుష్ప చిత్రం గురించి, అందులోని శ్రీవల్లీ పాటకు బన్నీ వేసిన స్టెప్పు గురించి మాట్లాడుతూ.. ‘పుష్ప మూవీ నిజంగా అద్భుతం. ఇంకా శ్రీవల్లి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. హీరో డ్యాన్స్ చేస్తూ చెప్పు వదిలేసినా సీన్ కూడా.. ఇంతలా వైరల్ కావడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి చూశా. ఆ స్టెప్పును చాలా మంది అనుకరించారు. ఎక్కడ పడితే అక్కడ ఆ స్టెప్ వేసి.. చెప్పులు వదిలేసి మరీ వేసుకునే వారు’ అంటూ అమితాబ్ నవ్వారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
GOAT praises GOAT. 🧎@SrBachchan @alluarjun #Pushpa pic.twitter.com/J5yPkgDq9a
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) November 8, 2023
Read Also : YouTuber: రైల్వేట్రాక్ పై యూట్యూబర్ టపాసులతో విన్యాసాలు