Banana Vs Foods : అరటిపండుతో ఈ ఫుడ్స్ కలిపి తినొద్దు
Banana Vs Foods : అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, బి, సి, విటమిన్ బి6 ఉన్నాయి.
- By Pasha Published Date - 02:23 PM, Mon - 27 November 23

Banana Vs Foods : అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, బి, సి, విటమిన్ బి6 ఉన్నాయి. అధిక బరువుతో ఉన్నవారు బరువు తగ్గడానికి అరటిపండ్లు దోహదపడతాయి. మన ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. అయితే అరటిపండును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. అలాంటి బ్యాడ్ కాంబినేషన్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
- బేకింగ్ ఫుడ్స్ మనం తింటుంటాం. వీటిలో ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు ఉంటాయి. బేకింగ్ ఫుడ్ ఐటమ్స్ జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. అరటిపండ్లు చాలా ఫాస్ట్‌గా జీర్ణం అవుతాయి. ఇలాంటి విరుద్ధ స్వభావం కలిగిన ఫుడ్స్‌ను కలిపి తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
- ఆయుర్వేదం ప్రకారం విరుద్ధ స్వభావం కలిగిన ఆహార పదార్థాలను తింటే వాత, పిత్త, కఫ దోషాల్లో అసమతుల్యత ఏర్పడుతుంది.
- నిమ్మ, దానిమ్మ, స్ట్రాబెర్రీ వంటి సిట్రస్ పండ్లను అరటిపండ్లతో కలిపి తినకూడదు. ఒకవేళ వీటిని కలిపి తింటే వికారం, తలనొప్పి వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
- అరటిపండ్లకు ఆమ్ల స్వభావం ఉంటుంది. కానీ పాలు మాత్రం తియ్యగా ఉంటాయి. ఇవి రెండూ కలిస్తే జీర్ణ సమస్యలు వస్తాయి. దగ్గు, జలుబు ఇతర అనారోగ్యాల ముప్పు పెరుగుతుంది.
- మాంసంలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. అరటిపండులోని ప్యూరిన్ అనే పదార్థం వల్ల అది త్వరగా జీర్ణం అవుతుంది. ఇవి రెండు కలిస్తే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ (Banana Vs Foods) వస్తాయి.