Daibetes: తరచూ కళ్ళు తిరుగుతున్నాయా.. అయితే ఈ రోగాలు ఉండొచ్చు!
సాధారణంగా చాలామంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలని పెద్దగా పట్టించుకోకుండా ఏమీ కాదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అలా చేయకుండా అలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు బాగు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో
- By Nakshatra Published Date - 12:16 PM, Tue - 27 September 22
సాధారణంగా చాలామంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలని పెద్దగా పట్టించుకోకుండా ఏమీ కాదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అలా చేయకుండా అలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు బాగు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రావు అని నిపుణులు చెబుతూ ఉంటారు. అలాంటి వాటిలో ముఖ్యంగా కళ్ళు తిరగడం సమస్య కూడా ఒకటి. చాలామంది ఏమి తినకపోయినా అలాగే ఏదైనా మెంటల్ గా ప్రెజర్ ను అనుభవించిన కళ్ళు తిరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా అనేక రకాల సమస్యలు కూడా ఉన్నాయి. అయితే కళ్ళు తిరిగే సమస్యను నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా కళ్లు తిరిగి పడిపోవడానికి గల కారణాలు..తలనొప్పి,అలసట, తిన్న తరువాత అలాగే వ్యాయామం చేసిన తర్వాత కళ్ళు తిరగడం, బలహీనంగా అనిపించడం కంటి చూపులో మార్పు వల్ల తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా కళ్ళు తిరగడం లాంటి సమస్య మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా కళ్ళు తిరుగుతూ ఉంటే అప్పుడు తప్పకుండా కార్డియాక్ ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే హార్ట్‌బీట్ సరిగ్గా లేకపోవడం అంటే కొన్ని కొన్ని సార్లు హార్ట్ బీట్ కొన్ని సెకన్ల పాటు ఆగిపోవడం వల్ల బ్లడ్ ఫ్లో టెంపరరీగా బ్రెయిన్‌కి వెళ్లదు.అదే విధంగా హఠాత్తుగా బ్లడ్ ప్రెషర్ లో మార్పు లు రావడం వల్ల బ్లడ్ సప్లై బ్రెయిన్‌కి తగ్గుతుంది.
ఈ సమస్య నుండి బయట పడాలంటే ప్రతిరోజు రెగ్యులర్‌గా మీల్స్‌ని తీసుకోండి. రోజులో ఏ మీల్స్‌ని స్కిప్ చేయొద్దు. అలాగే తగినంత నీరు తీసుకోవడం మంచిది. ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల మంచి నీళ్ళు త్రాగడం చాలా అవసరం. మంచి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా మీరు ఎప్పుడూ కూడా ఒకే దగ్గర నిల్చుని ఉండకుండా మీ కాళ్ళని అటు ఇటు కదపడం లేదా కొంచం దూరం నడవడం లాంటివి చేయాలి. ఎక్కువగా కళ్లు తిరిగేవాళ్ళు వేడి ప్రదేశంలో ఉండకూడదు.
అదే విధంగా డయాబెటిస్ లేదా కార్డియో వాస్క్యులర్ సమస్యలు ఉంటే మంచి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడాలి. అప్పుడు ఆ మందులు తీసుకోవడం వల్ల మీకు కాస్త తల తిరుగుతున్నట్టు కానీ లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కొన్నిసార్లు మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కూడా తలనొప్పి కళ్ళు తిరగడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
Related News
Eggs: డయాబెటిక్ రోగులు గుడ్డు తినొచ్చా.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే
Eggs: గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో, డయాబెటిక్ రోగులు తినాలా? డయాబెటిక్ పేషెంట్ ఖాళీ కడుపుతో గుడ్డు-రొట్టె తినవచ్చా? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను ఈ వార్తలో తెలుసుకొండి. గుడ్డులో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని కొందరు నమ్ముతారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగవచ్చు. అదనంగా, కొలెస్ట్రాల్ ప్రమాదం కూడా పెరుగుతుంది. గుడ్లు తినడం వల్ల శరీర పోషణక�