Crispy Vegetable Dosa: గోధుమపిండితో ఎంతో క్రిస్పీ గా ఉండే వెజిటేబుల్ దోశ.?
మనం దోశలో ఎన్నో రకాల దోశలు తినే ఉంటాం. ప్లెయిన్ దోస,కారం దోస, ఎగ్ దోస, పెసరట్టు, ఉప్మా దోసే ఇలా ఎన్నో రకాల దోశలు తినే ఉంటాం. ఇది చాలా వరకు
- By Anshu Published Date - 10:00 PM, Mon - 19 February 24

మనం దోశలో ఎన్నో రకాల దోశలు తినే ఉంటాం. ప్లెయిన్ దోస,కారం దోస, ఎగ్ దోస, పెసరట్టు, ఉప్మా దోసే ఇలా ఎన్నో రకాల దోశలు తినే ఉంటాం. ఇది చాలా వరకు వీటిని బియ్యప్పిండితో తయారు చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా గోధుమ పిండితో తయారుచేసిన గోధుమపిండి వెజిటేబుల్ దోస తిన్నారా. ఎప్పుడు తినకపోతే ఈ దోశ ని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
గోధుమ పిండి – 1 కప్పు
బియ్యం పిండి – అరకప్పు
మిక్స్డ్ వెజిటేబుల్స్ – క్యారెట్, బెల్ పెప్పర్స్, ఉల్లిపాయలు
పచ్చిమిర్చి – 2
కొత్తిమీర – గుప్పెడు
ఇంగువ – చిటికెడు
జీలకర్ర – అర టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
నూనె లేదా నెయ్యి – దోశలకు సరిపడా
తయారీ విధానం :
ముందుగా మిక్సింగ్ గిన్నెలో గోధుమ పిండి తీసుకొని అందులో బియ్యపు పిండిని వేసి మిక్స్ చేయాలి. దానిలో ఇంగువ, సాల్ట్, జీలకర్ర వేసి బాగా కలపాలి. దోశ బ్యాటర్ వలె వచ్చేంత నీరు పోసి పిండిలో ఉండలు లేకుండా కలపాలి. పిండిని ఎంతబాగా మిక్స్ చేసుకుంటే దోశలు అంత మంచిగా వస్తాయి. ఈ మిశ్రమంపై మూతవేసి10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టండి. దానిలో కొద్దిగా నూనె వేసి తరిగిన కూరగాయలను వేయాలి. వాటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసి అవి కాస్త మెత్తబడేవరకు మగ్గనివ్వాలి. స్టౌవ్ మీద నుంచి పాన్ తీసేసి ఇప్పుడు దోశ పాన్ స్టవ్‌పై ఉంచాలి. పాన్ వేడి అయ్యాక ముందుగా రెడీ చేసుకున్న పిండి మిశ్రమాన్ని దోశల్లాగ వేసుకోవాలి. దానిపై ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ వేసి కొత్తిమీర చల్లాలి. దోశ అంచుల చుట్టూ నూనె లేదా నెయ్యి వేయాలి. కొంచెం బాగా కాలిన తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమపిండి వెజిటేబుల్స్ దోస రెడీ..