Brain Vs Politics : రాజకీయ ఆలోచనలకు బ్రెయిన్‌తో లింక్.. ఆసక్తికర వివరాలు
వియత్నాం యుద్ధంలో పాల్గొన్న అమెరికా సైనికులపై అధ్యయనం చేసిన తర్వాతే శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారని లియోర్ జ్మిగ్రాండ్(Brain Vs Politics) పేర్కొన్నారు.
- By Pasha Published Date - 08:15 AM, Tue - 8 April 25

Brain Vs Politics : రాజకీయాలు అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్లకు అదొక బోరింగ్ టాపిక్. ఎంటర్‌టైన్‌మెంట్ ముచ్చట్లను మాత్రం ఎగబడి చూస్తారు. దేశ భవిష్యత్తు రాజకీయాలతోనే నిర్మితం అవుతుందని మర్చిపోతుంటారు. కొందరు మాత్రం రాజకీయాలపై ఆసక్తితో ఉంటారు. వెంటనే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇంకొందరు తగిన సమయం కోసం ఎదురుచూస్తారు. మరికొందరు తెర వెనుక నుంచి పనిచేస్తూ సైలెంటుగా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఎవ్వరూ ఊహించనంత ఛాన్స్ పొందుతారు. ఇలా రాజకీయాలపై మనుషుల్లో తీరొక్క ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలకు ఆద్యం మన మెదడు. మనిషి మెదడుకు రాజకీయ ఆలోచనలు ఎలా వస్తాయి ? అనే దానిపై కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఆ వివరాలను తెలుసుకుందాం..
Also Read :Dilsukhnagar Bomb Blasts : దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు.. నేడే తీర్పు.. ఏమిటీ కేసు ?
‘అమిగ్దలా’ దెబ్బతింటే.. అలా జరుగుతుంది
లియోర్ జ్మిగ్రాండ్.. బ్రిటన్ వాస్తవ్యురాలు. ఆమె ఒక న్యూరో సైంటిస్టు. మెదడు పనితీరుపై అధ్యయనం చేస్తుంటారు. లియోర్ తాజాగా ఒక పుస్తకం రాశారు. దానికి ది ఐడియోలాజికల్ బ్రెయిన్ : ది రాడికల్ సైన్స్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ థింకింగ్ (The Ideological Brain: The Radical Science of Flexible Thinking) అనే టైటిల్ పెట్టారు. మనిషి మెదడులో స్వీయ నియంత్రణ, తర్కం వంటి విధులకు సాయపడే భాగం పేరు ‘ప్రి ఫ్రాంటల్ కార్టెక్స్’. ‘ప్రి ఫ్రాంటల్ కార్టెక్స్’కు దెబ్బ తగిలితే రాజకీయ భావనలు తీవ్రతరం అవుతాయని తన పుస్తకంలో లియోర్ జ్మిగ్రాండ్ రాశారు. మెదడులో ‘అమిగ్దలా’ అనే మరో భాగం ఉంటుంది. అది మన ఎమోషన్స్ (భావోద్వేగాలు)ను ప్రాసెస్ చేస్తుంటుంది. ఒకవేళ ‘అమిగ్దలా’ దెబ్బతింటే మనిషిలో ఎమోషన్స్ తగ్గిపోతాయని ఆమె రాసుకొచ్చారు.
Also Read :Kadiyam Vs Palla : నేను విశ్వసంగా ఉండే కుక్కనే..నీలాగా గుంట నక్క కాదు – పల్లా రాజేశ్వర్ రెడ్డి
వియత్నాం యుద్ధంలో..
వియత్నాం యుద్ధంలో పాల్గొన్న అమెరికా సైనికులపై అధ్యయనం చేసిన తర్వాతే శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారని లియోర్ జ్మిగ్రాండ్(Brain Vs Politics) పేర్కొన్నారు. ‘‘ సైంటిస్టులు రెండు రకాల మనుషులపై స్టడీ చేశారు. మొదటి వర్గంలో మెదడు భాగాల్లో గాయాలైన వారు, అసాధారణ మార్పులను చవిచూసిన వారు ఉన్నారు. రెండో వర్గంలో సాధారణ వ్యక్తులు ఉన్నారు. ఈ ఇద్దరి మెదడుల పనితీరును, స్పందనలను, నియంత్రణ ఆదేశాలను శాస్త్రవేత్తలు పోల్చి చూశారు. ఈక్రమంలోనే తొలిసారిగా రాజకీయ భావనలను నియంత్రించే మెదడు నెట్‌వర్క్‌ను గుర్తించారు’’ అని లియోర్ జ్మిగ్రాండ్ వెల్లడించారు. అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీలో ఈ పరిశోధనలు జరిగాయని ఆమె చెప్పారు.