HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >Christmas 2025 This Dish Not Cake Was The First Favorite Christmas Dessert

క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

నేటి కాలంలో మనం రుచి చూసే రిచ్ ఫ్రూట్ కేక్ (ఇందులో రమ్, దాల్చినచెక్క, జాజికాయ, చెర్రీస్, కిస్‌మిస్, బాదం ఉంటాయి) వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది.

  • Author : Gopichand Date : 24-12-2025 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Christmas Cake
Christmas Cake

Christmas Cake: క్రిస్మస్ పండుగ అనగానే క్రిస్మస్ ట్రీ తర్వాత అందరికీ గుర్తొచ్చేది కేక్. ఈ పండుగలో కేక్ అనేది ఒక ప్రధానమైన తీపి పదార్థం. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మొదటి క్రిస్మస్ కేక్ అసలు కేక్ కాదని, అది ప్లమ్ పారిడ్జ్ (Plum Porridge- ఒక రకమైన గంజి) అని మీకు తెలుసా? క్రిస్మస్ కేక్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇక్కడ ఉంది.

క్రిస్మస్ కేక్ చరిత్ర

నేటి కాలంలో మనం రుచి చూసే రిచ్ ఫ్రూట్ కేక్ (ఇందులో రమ్, దాల్చినచెక్క, జాజికాయ, చెర్రీస్, కిస్‌మిస్, బాదం ఉంటాయి) వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. పాత కాలంలో క్రిస్మస్ వేడుకలను డిసెంబర్ 6 నుండి జనవరి 6 వరకు అంటే నెల రోజుల పాటు జరుపుకునేవారు. శీతాకాలం కావడం వల్ల ప్రజలు ఈ పండుగను ఎక్కువ కాలం ఎంజాయ్ చేసేవారు.

Also Read: క్రిస్మస్ పండుగ.. డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

ఆ సమయంలో ‘అడ్వెంట్’ (క్రిస్మస్‌కు ముందు చేసే ఉపవాసం) సమయంలో ప్రజలు చాలా తేలికపాటి, సాధారణ ఆహారాన్ని తీసుకునేవారు. ఉపవాసం పూర్తయిన తర్వాత వారు ‘ప్లమ్ పారిడ్జ్’ తయారు చేసేవారు. ఇందులో గోధుమ రవ్వ లేదా దాలియా, మసాలా దినుసులు, తేనె, ఎండిన రేగు పండ్లు కలిపి వండేవారు. ఇది కేవలం రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసేది.

గంజి నుండి కేక్‌గా మార్పు

16వ శతాబ్దంలో ఈ రేగు పండ్ల గంజి కొత్త రూపాన్ని సంతరించుకుంది. గంజిలో ఓట్స్ లేదా రవ్వకు బదులుగా గుడ్లు, పిండి, మసాలాలు, వెన్న కలపడం ప్రారంభించారు. దీనివల్ల అది గంజిలా కాకుండా కేక్ లాగా మారడం మొదలైంది. అప్పట్లో ధనవంతులు తమ కేకుల్లో డ్రై ఫ్రూట్స్, షుగర్ కోటెడ్ మిశ్రమాలను కలిపి అందంగా అలంకరించేవారు. క్రమక్రమంగా ఇది ‘క్రిస్మస్ కేక్’గా గుర్తింపు పొందింది. 18, 19వ శతాబ్దాలలో పారిశ్రామిక విప్లవం రావడం వల్ల ప్రజలు పనుల్లో బిజీ అయిపోయారు. దీనితో నెల రోజుల పాటు జరిగే క్రిస్మస్ వేడుకలు కాస్తా కేవలం డిసెంబర్ 25కే పరిమితం అయ్యాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Christmas 2025
  • Christmas Cake
  • Christmas Dessert
  • Jesus Christ
  • Plum Porridge

Related News

Christmas 2025

మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

Christmas 2025 : చీకటిమయమైన లోకంలో వెలుగును నింపడానికి యేసుక్రీస్తు జన్మించాడని (Jesus Christ Birth Date) నమ్ముతారు. అందుకే ఇళ్లను క్రిస్మస్‌ స్టార్స్‌, విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. ఈ వెలుగు మన జీవితంలో అజ్ఞానాన్ని, బాధలను తొలగిస్తుందని అర్థం. అలాగే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఒకరినొకరు క్షమించుకోవాలని కరుణ కలిగి ఉండాలని, అంతేకాకుండా మన దగ్గర ఉన్న దానిని కష్టాల్లో ఉన్న ఇ

  • Christmas

    క్రిస్మస్ పండుగ.. డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?

Latest News

  • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

  • అరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం నిషేధం!

  • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

  • జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌.. డేట్ కూడా ఫిక్స్‌!

  • భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్!

Trending News

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

    • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

    • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd