Chicken Pakodi: సండే స్పెషల్ క్రిస్పీ చికెన్ పకోడి.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే?
- By Sailaja Reddy Published Date - 03:00 PM, Sat - 17 February 24

మామూలుగా ప్రతి ఆదివారం పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఉండడంతో చాలామంది ఎక్కువగా నాన్వెజ్ను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక నాన్ వెజ్ లో ఎన్నో రకాల వెరైటీస్ ని చేసుకుని తింటూ ఉంటారు. కొంతమంది బయట ఫుడ్ తినాలని ఉన్నప్పటికీ వాటిని తినలేక ఇలా చేసుకోవాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. బయట దొరికే ఫుడ్లలో ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ చికెన్ పకోడీ. మరి ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు :
ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క – 2 అంగుళాలు
లవంగాలు – 6
యాలకులు – 4
జీలకర్ర – అర టీ స్పూన్
చికెన్ – అరకేజి
నిమ్మరసం – ఒకటిన్నర టేబుల్ స్పూన్
పసుపు – అర టీస్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
గరం మసాలా – ఒకటిన్నర టీ స్పూన్
ఉల్లిపాయ – 1 పెద్దది
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
సాల్ట్ – తగినంత
పెరుగు – 2 టేబుల్ స్పూన్స్
మొక్కజొన్న పిండి – 3 టేబుల్ స్పూన్స్
నూనె – తగినంత
తయారీ విధానం
పెద్ద గిన్నె తీసుకుని దానిలో చికెన్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కారం, ధనియాల పొడి, సాల్ట్, మిరియాల పొడి, పెరుగు, నెయ్యి, కరివేపాకు వేసి బాగా కలపాలి. పొడులు అన్ని చికెన్‌కి బాగా పట్టేలా చేతితో కలపాలి. దీనిలో కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. అది వేడి అయ్యాక దానిలో చికెన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. మంట ఎప్పుడూ మధ్యమంగానే ఉంచుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత బయటకు తీయాలి. ఈ వేడి వేడి చికెన్ పకోడిని ఫ్రెష్ నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడీ రెడీ.