Cardamoms: పొట్ట నిండా తిన్న తర్వాత ఒకటి లేదా రెండు యాలకులు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Cardamoms: పొట్టనిండా భోజనం చేసిన తర్వాత ఒకటి లేదా రెండు యాలకులను తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:30 AM, Mon - 10 November 25
Cardamoms: యాలకుల వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. యాలకులు ఒక సుగంధ ద్రవ్యం. యాలకుల్లో విటమిన్ బి, సి, జింక్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు నిండుగా ఉంటాయట.
భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి ముఖ్యంగా భోజనం తర్వాత ఒక యాలకును నమిలితే జీర్ణక్రియ మెరుగుపడుతుందట. గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ, గుండెల్లో మంట, అజీర్తి లాంటి సమస్యలను పరిష్కరించడానికి యాలకులు ఎంతో సహకరిస్తాయని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా యాలకులు ఉపయోగపడతాయట. నోటి దుర్వాసన సమస్యతోబాధపడుతున్నవారు ప్రతిరోజూ ఆహారం తిన్నాక ఒక యాలకని నోట్లో వేసుకుని నమిలితే చాలా మంచిదట. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసనను పోగొడుతాయని చెబుతున్నారు.
నోటి ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయట. వికారం, వాంతులను అరికట్టడానికి కూడా భోజనం తర్వాత యాలకులు నమలడం మంచిదట. ఒత్తిడి తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రాత్రి మంచి నిద్ర పట్టడానికి రాత్రి భోజనం తర్వాత యాలకులు తినడం మంచిదట. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే యాలకులను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న యాలకులు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయట. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా యాలకులు చాలా మంచివని చెబుతున్నారు.