Rose Tea: నెలసరి సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే గులాబీతో ఇలా చేయాల్సిందే?
స్త్రీలకు ప్రతి నెల నెలసరి రావడం అన్నది సహజం. అయితే కొందరు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు కడుపునొప్పి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. కొం
- By Anshu Published Date - 09:30 PM, Mon - 14 August 23

స్త్రీలకు ప్రతి నెల నెలసరి రావడం అన్నది సహజం. అయితే కొందరు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు కడుపునొప్పి సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు ఈ నొప్పికి తట్టుకోలేక టాబ్లెట్స్ కూడా మింగుతూ ఉంటారు. నెలసరి సమయంలో వచ్చే.. కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, అధిక రక్త స్రావం, వాంతులు, కళ్లు తిరగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎక్కువమంది మహిళలకు కడుపు నొప్పి, నడుము నొప్పి, పొత్తికడుపు నొప్పి వేధిస్తూ ఉంటాయి. కొందిమందికి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి గులాబీ పువ్వు బాగా ఉపశమనం లభించేలా చేస్తుంది.. మరి గులాబీని ఎలా ఉపయోగించాలన్న విషయాన వస్తే.. గులాబీలో ఎ, సి విటమిన్లు, పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. గులాబీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. గులాబీ రేకులతో తయారు చేసిన టీ తరచు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఒక కప్పు రోజ్ టీ ఆందోళనను తగ్గించడానికి, స్ట్రెస్‌ను కంట్రోల్ ఉంచడానికి సహాయపడుతుంది. గులాబీ లోని పోషకాలు విశ్రాంతిని కలిగిస్తాయి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో, నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.
గులాబీ రేకులను జీర్ణక్రియను ప్రోత్సహించడానికి ఎన్నో శతాబ్దాలుగా ఉపోయోగిస్తున్నారు. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, కడుపు సమస్యలను తగ్గించడంలో తోడ్పడతాయి. రోజ్‌టీ కాన్స్టిపేషన్‌కు ఔషధంలా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. నెలసరి సమయంలో రోజ్ టీ తాగితే కడుపు నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తింది. రోజ్ టీ మానసిక, శారీరక పీరియడ్ లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది.. చెబుతున్నాయి. ఇది పెయిన్ కిల్లర్స్, ఓవర్ ది కౌంటర్ మెడిసిన్‌లకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. గులాబీ టీలో విటమిన్ ఏ, సి , పాలీఫినాల్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు త్వరిత శక్తినిస్తాయి. రోగనిరోధకత శక్తిని మెరుగుపరుస్తాయి.
ఈ హెర్బల్ టీ మిమ్మల్ని అనారోగ్యాల నుంచి దూరంగా ఉంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందున శరీరంలోని ఇన్‌ఫెక్షన్‌లను నయం చేసి బరువు తగ్గించడానికి తోడ్పడుతుంది. తరచూ దగ్గూ, జలుబు బారినపడకుండా చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. గులాబీ టీ శరీరంలోని వ్యర్థాలను ఈ పానీయం తొలగిస్తుంది. తద్వారా అధిక కొవ్వును తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. గులాబీ రేకులలోని యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేయడంలో సహాయపడతాయి. శరీరంలోని సెల్యులార్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. క్యాన్సర్ వంటి క్షీణించిన వ్యాధులను నివారించడానికి కూడా ఇవి సహాయపడతాయి.