Bitter gourd for haircare: చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే కాకరకాయతో ఇలా చేయాల్సిందే?
రకరకాల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. ఇందులో పోషకాలు మెండుగా
- By Anshu Published Date - 10:00 PM, Sun - 28 January 24

రకరకాల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాకరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. అలాగే కాకరకాయలో విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి9, పొటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే కాకార కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కురుల సంరక్షణకు కాకరకాయ ఎంతో బాగా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు తలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
జుట్టు త్వరగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి. చుండ్రు సమస్యకు ఈ కాకరకాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది.. మరి కాకరకాయతో చుండ్రు సమస్యను ఎలా పోగొట్టుకోవాలి అన్న విషయానికి వస్తే.. కాకర రసంలో జీలకర్రపొడి వేసి మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మాడుకు అప్లై చేసుకోవాలి. దీన్ని 15 నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుంచి మూడుసార్లు చేస్తే చుండ్రు మాయం అవుతుంది. అలాగే మీరు పొడిబారిన జుట్టు కారణంగా ఇబ్బందిపడుతుంటే.. కాకరకాయ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. పెరుగు అరకప్పు పెరుగులో, రెండు చెంచాల కాకరరసం, స్పూన్ నిమ్మరసం యాడ్ చేసి మిక్స్ చేసుకోండి.
దీన్ని తలకు, జుట్టుకు పట్టించి మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. దీన్ని ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. ఇలా తరచూ చేస్తే జుట్టుకు తేమ అందుతుంది, పట్టులాంటి జుట్టు మీ సొంతం అవుతుంది. చాలామంది హెయిర్ బ్రేకేజ్ కారణంగా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కాకరరసాన్ని తలకు అప్లై చేసుకోవాలి. దీన్ని 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు చిట్లడం తగ్గుతుంది.