Bezawada Punugulu: బెజవాడ స్టైల్ దోశపిండి పునుగులు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే?
బెజవాడ ఫెమస్ ఫుడ్ అనగానే పునుగులు గుర్తుకు వస్తాయి. బెజవాడలో ఎక్కడ చూసినా కూడా ఈ ఫుడ్డు బాగా అమ్ముతూ ఉంటారు. విజయవాడకు వెళ్లిన ప్రతి ఒక్కర
- By Anshu Published Date - 10:07 PM, Tue - 13 February 24
బెజవాడ ఫెమస్ ఫుడ్ అనగానే పునుగులు గుర్తుకు వస్తాయి. బెజవాడలో ఎక్కడ చూసినా కూడా ఈ ఫుడ్డు బాగా అమ్ముతూ ఉంటారు. విజయవాడకు వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఫుడ్ ని తప్పనిసరిగా టెస్ట్ చేస్తూ ఉంటారు. మరి బెజవాడ స్టైల్ పునుగులను ఇంట్లో కూడా తయారు చేసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బెజవాడ పునుగులకు కావాల్సిన పదార్థాలు :
దోశ పిండి – 250 గ్రాములు
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టీస్పూన్
ఉల్లిపాయ – 2
పచ్చిమిర్చి – 3
కరివేపాకు – 1 రెబ్బ
మైదా పిండి – సరిపడినంత
నూనె – డీప్ ఫ్రైకి తగినంత
పునుగులు తయారీ విధానం:
దోశ పిండి కాస్త పులిసింది ఉంటేనే పునుగులు టేస్ట్ వస్తాయి. ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కడిగి చిన్నచిన్న ముక్కులుగా కోసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో దోశ పిండి తీసుకుని దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే దోశ పిండిలో మైదా పిండిని విడతలు వారీగా వేసి పునుగులు వేసేందుకు వీలుగా వచ్చేంత వరకు పిండిని వేస్తూండాలి. మైదా త్వరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి బ్యాటర్‌ను వీలైనంత వేగంగా కలుపుతూ ఉండాలి. పిండిలో ఉండలు లేకుండా ఉంటేనే పునుగులు గుల్లగా వస్తాయి. పునుగులు వేసేందుకు పిండి రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు స్టౌవ్ వెలిగించి, కడాయి పెట్టి నూనె వేడి అయిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా వేయాలి. కాస్త కలర్ వచ్చాక తీసేస్త ఎంతో టేస్టీgగా ఉండే పునుగులు రెడీ.