Green Tea: గ్రీన్ టీతో అందాన్ని పెంచుకోవచ్చని మీకు తెలుసా?
గ్రీన్ టీ తో అందాన్ని పెంచుకోవచ్చని అందుకోసం కొన్ని రకాల చిట్కాలు పాటించాలని చెబుతున్నారు..
- By Anshu Published Date - 04:00 PM, Sun - 3 November 24

గ్రీన్ టీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గ్రీన్ టీ లో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే గ్రీన్ టీతో అందాన్ని కూడా పెంచుకోవచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గ్రీన్ టీ ని ఒక స్పూను తీసుకొని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ డ్రై అయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందట. అలాగే గ్రీన్ టీని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుందట. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుందని చెబుతున్నారు. పింపుల్స్ తో ఇబ్బంది పడుతున్న వారు గ్రీన్ టీతో ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలో ఉన్న మలినాలు తొలగి చర్మం శుభ్రం అవుతుందని చెబుతున్నారు. బయటికి వెళ్లే ముందు ఒకసారి గ్రీన్ టీ తో మొఖం కడుక్కోవడం వలన మీ ముఖం మెరుస్తూ కనిపిస్తుందట.
అలాగే ఇందులో ఉండే సాలి ఫినాల్స్ ఆల్ఫా డిడక్టైజ్ గుణాలు జుట్టుని రాలకుండా కాపాడుతుంది. నెలకి ఒకసారి గ్రీన్ టీ ని తలకి పట్టించడం వల్ల మీ శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. గ్రీన్ టీ బ్యాగులను ఫ్రిజ్లో గంట పాటు ఉంచి ఆ తర్వాత దాన్ని కళ్ళపై ఒక అరగంట పాటు పెట్టుకోవడం వల్ల కళ్ళు మెరుస్తూ ఉంటాయట. కళ్ళ కింద ఉండే ముడతలు మచ్చలు, నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు.