Cardamom: నిద్రపోయే ముందు యాలకులు తిని పడుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Cardamom: రాత్రి సమయంలో నిద్రపోయే ముందు యాలకులను తిని పడుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలగడంతో పాటు అనేక సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 07:30 AM, Wed - 1 October 25

Cardamom: మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. యాలకులను ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా స్వీట్ల తయారీలో యాలకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. యాలకులను నేరుగా కూడా తీసుకోవచ్చు. కొంతమంది స్వీట్లు వంటల రూపంలో తినడానికి ఇష్టపడితే మరి కొంతమంది నేరుగా కూడా తింటూ ఉంటారు. చాలామందికి భోజనం తిన్న తర్వాత యాలకులు తినడం అలవాటు. ఇది నోటి దుర్వాసనను దూరం చేయడంతో పాటుగా ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. అయితే యాలకులను రాత్రిపూట పడుకునే ముందు తింటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయట.
అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా యాలకుల్లోని జీర్ణ ఎంజైమ్ లు మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయట. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆహారాన్ని సమర్థవంతంగా జీర్ణం చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయట. కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలు దూరమవుతాయని, ఎక్కువ భోజనం తీసుకున్నప్పుడు, ఆలస్యంగా తిన్నప్పుడు తీసుకుంటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటుందని చెబుతున్నారు. దీనిలోని యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు కడుపులోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయట. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకుంటే పోషకాల శోషణ మెరుగవుతుందని చెబుతున్నారు.
నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు రాత్రిపూట యాలకులను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే సినీయోల్ వంటి ముఖ్యమైన ఆయిల్స్ నోట్లోని బ్యాక్టీరియాతో పోరాడతాయి. మీ శ్వాసను సువాసనతో నింపడమే కాకుండా బ్యాక్టీరియాను కూడా తగ్గిస్తాయి. చిగుళ్ల వాపు తగ్గడంతో పాటు పరిశుభ్రతను ఇస్తుందట. నోటిలోని తేమను నిర్వహించడానికి, pHని సమతుల్యం చేయడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు యాలకులను రాత్రిపూట తీసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చట. ఇలాచిలో ఉండే మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు నాడీ వ్యవస్థను రిలాక్స్ చేస్తాయట. మంచి నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తాయని,ఒత్తిడి తగ్గుతుందని గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అలాగే యాలకుల ప్రభావం రక్తంలో చక్కెరను నియంత్రిస్తుందట. క్రమం తప్పకుండా తీసుకోవడం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ అవుతాయట. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయట. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ రిచ్ సమ్మేళనాలు రాత్రిపూట రక్తంలో చక్కెర పెరగకుండా నిరోధిస్తాయని చెబుతున్నారు.