Coconut Oil : చలికాలంలో చర్మం పొడిబారకుండా.. కొబ్బరినూనెతో ఇలా చేయండి..
చర్మం పొడిబారకుండా ఉండడానికి కొబ్బరినూనెను(Coconut Oil) ఉపయోగించుకోవచ్చు.
- Author : News Desk
Date : 24-11-2023 - 6:02 IST
Published By : Hashtagu Telugu Desk
చలికాలం(Winter) వచ్చేసింది. రోజు రోజుకు చలి విపరీతంగా పెరుగుతుంది. చలికాలంలో మన చర్మం పొడిబారడం, పగలడం జరుగుతుంది. దీని వలన చర్మం తాజాగా కనిపించదు. చలికాలం రాగానే జుట్టు ఊడడం కూడా ఎక్కువగా జరుగుతుంది. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడం వలన చర్మం పొడిబారడం జరుగుతుంది.
చర్మం పొడిబారకుండా ఉండడానికి కొబ్బరినూనెను(Coconut Oil) ఉపయోగించుకోవచ్చు. కొబ్బరినూనెను మన శరీరానికి రాసుకోవడం వలన మన చర్మం పొడిబారడం తగ్గుతుంది.
చలికాలంలో పెదాలు కూడా ఎక్కువగా పగులుతుంటాయి. రోజూ రాత్రి పడుకునే ముందు పెదాల పైన కొబ్బరినూనెను రాసుకొని పడుకోవడం వలన పెదాలు మృదువుగా తయారవుతాయి. మన ముఖానికి, మెడకు కూడా కొబ్బరినూనె రాసుకోవచ్చు దీని వలన మన ముఖం మీద నల్లని మచ్చలు తగ్గుతాయి.
మన ముఖంపై మొటిమలు రావడానికి ఉపయోగపడే బ్యాక్టీరియాను కొబ్బరినూనె నాశనం చేస్తుంది. దీని వలన మన ముఖం పైన మొటిమలు రావడం తగ్గుతాయి.
మన చర్మానికి కొబ్బరినూనె రాయడం వలన పగిలిన చర్మానికి మాయిచ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. మన చర్మం తాజాగా ఉండడానికి సహాయపడుతుంది. చర్మాన్ని తాజాగా ఉంచడానికి స్నానానికి ముందు లేదా మనం స్నానం చేసిన తరువాత కొబ్బరినూనెను మన చర్మానికి రాసుకోవచ్చు. చలికాలంలో మనం మేకప్ తొలగించడానికి కూడా కొబ్బరినూనెను ఉపయోగించవచ్చు. ఈ విధంగా మనం కొబ్బరినూనెను వాడుకొని చలికాలంలో మన చర్మం పగలకుండా మృదువుగా ఉండేలా చూసుకోవచ్చు.
Also Read : Coconut Milk : పొడవాటి జుట్టు కావాలంటే కొబ్బరి పాలలో ఆ రెండు కలిపి రాయాల్సిందే?