Ghee for Beauty: నెయ్యిని అలా ఉపయోగిస్తే చాలు.. ముఖం, జుట్టు మెరవడం ఖాయం?
నెయ్యి దాదాపుగా మన అందరి ఇళ్లలో ఉంటుంది. చాలామంది నెయ్యిని ఎన్నో రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే అనేక స్వీట్ల తయారీలో కూడా నెయ్యిని ఉప
- By Nakshatra Published Date - 09:30 PM, Thu - 27 July 23
నెయ్యి దాదాపుగా మన అందరి ఇళ్లలో ఉంటుంది. చాలామంది నెయ్యిని ఎన్నో రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే అనేక స్వీట్ల తయారీలో కూడా నెయ్యిని ఉపయోగిస్తూ ఉంటారు. నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నెయ్యిలో బ్యూటీని పెంచే పదార్థాలు ఉన్నాయి. నెయ్యిలో ఎక్కువగా మాయిశ్చరైజర్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్అన్ని కూడా మీ చర్మంలో తేమని లాక్ చేసి స్కిన్ హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. ఇందులోని నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ స్కిన్‌ని ఫ్రీరాడిక్స, ఆక్సిడేటివ్స్ నుంచి మన స్కిన్‌ని కాపాడతాయి. అందుకోసం మీ స్కిన్‌పై నెయ్యిని రాయడం అలవాటు చేసుకోండి.
నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఈలు మీ స్కిన్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ ఎ కొల్లాజెన్‌ని ఉత్పత్తి చేసి స్కిన్ ఆరోగ్యంగా ఉంచి ఎలాస్టిసిటీని పెంచుతుంది. విటమిన్ డి మిమ్మల్ని ఎప్పటికప్పుడు యవ్వనంగా కనిపించేలా చేయడమే కాకుండా కొత్త కణాలు పెరిగేలా చేస్తుంది. విటమిన్ ఈ అనేది యాంటీ ఆక్సిడెంట్‌గా నిచేసి స్కిన్‌ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. రెగ్యులర్‌గా నెయ్యిని ఉపయోగించడం వల్ల చర్మంపై ముడతలు, గీతలు తగ్గి స్కిన్ అందంగా మారుతుంది. అదే విధంగా చర్మంపై ఏవైనా సమస్యలు ఉండి, దురద వంటి సమస్యలొస్తే వాటిని దూరం చేసేందుకు నెయ్యి హెల్ప్ చేస్తుంది. నెయ్యిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై ఉన్న సమస్యల్ని దూరం చేస్తుంది.
అదే విధంగా ఇందులోని బట్రియాక్ యాసిడ్.. ఇది నేచురల్ ఫ్యాటీ యాసిడ్‌లా పనిచేసి స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేస్తుంది.నెయ్యిని ముఖంపై రాయడం చాలా ఈజి. దీనిని మీ డెయిలీ రొటీన్లో యాడ్ చేయడం కూడా ఈజీ. ఇందుకోసం కొద్దిగా నెయ్యి తీసుకుని ముఖంపై మృదువుగా మసాజ్ చేయాలి. దీనిని మాయిశ్చరైజర్ బదులుగా రాయవచ్చు. ముందుగా కొద్దిగా నెయ్యి తీసుకుని పెదాలపై అప్లై చేయాలి. దీంతో మృదువైన పెదాలు మీ సొంతం. ఇప్పుడు చర్మం కోసం షియా బటర్, నెయ్యి, ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ 2 చుక్కలు కలిపి చర్మంపై అప్లై చేయాలి. అదే విధంగా, దీనిని మీ డైట్లో చేర్చడం వల్ల కూడా బ్యూటీని సొంతం చేసుకోవచచు. నెయ్యిని తీసుకోవడం వల్ల చర్మాన్ని లోపల్నించి అందంగా తయారు చేయొచ్చు. ఇందులోని ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ మీ స్కిన్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Related News
Banana With Ghee: నెయ్యి అరటిపండు కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
నెయ్యి,అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రెండింటిని కొంచెం పంచామృతంలో వినియోగిస్తూ ఉంటారు. చాలామంది ఈ రెండింటిని తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. రెండింటిలోనూ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అరటిపండులో విటమిన్ సి, బి-6, యాంటీ ఆక్సిడెంట్లు, పొట�