Beard Balm Vs Beard Oil : బీయర్డ్ బామ్, బీయర్డ్ ఆయిల్.. గడ్డం స్టైలిష్ లుక్ కోసం ఏది బెటర్ ?
Beard Balm Vs Beard Oil : స్టైలిష్‌గా గడ్డం పెంచుకోవాలని చాలామంది పురుషులకు ఉంటుంది.
- By Pasha Published Date - 02:58 PM, Wed - 1 November 23

Beard Balm Vs Beard Oil : స్టైలిష్‌గా గడ్డం పెంచుకోవాలని చాలామంది పురుషులకు ఉంటుంది. ఇందుకోసం కొందరు బీయర్డ్ బామ్.. ఇంకొందరు బీయర్డ్ ఆయిల్ వాడుతుంటారు. అయితే వీటిలో ఏది బెటర్ అనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
బీయర్డ్ ఆయిల్‌లో ఏముంటుంది ?
బీయర్డ్ ఆయిల్ విషయానికి వస్తే.. అది పురుషుల గడ్డానికి లోపలి నుంచి పోషణ అందిస్తుంది. ఇందులో కండీషనర్లు, ఆర్గాన్ ఆయిల్, జోజోబా ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్, షియా ఆయిల్ ఉంటాయి. ఇవి గడ్డం పెరుగుదలకు హెల్ప్ చేయడంతో పాటు గడ్డానికి సరైన తేమను అందిస్తాయి. గడ్డంలో దురదను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది. అందుకే కొంతమంది షేవింగ్ చేసుకున్న తర్వాత కూడా బీయర్డ్ ఆయిల్‌ను వాడుతుంటారు. ఈ నూనె చర్మ రంధ్రాల ద్వారా గడ్డం భాగంలోకి చొచ్చుకొనిపోయి చర్మానికి తేమను అందిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
బీయర్డ్ బామ్‌లో ఏముంటుంది ?
గడ్డం అడ్డగోలుగా ఉంటే.. సరైన దారిలోకి తెచ్చేందుకు బీయర్డ్ బామ్ ఉపయోగపడుతుంది. బీయర్డ్ బామ్ అనేది ఆల్ ఇన్ వన్ ఉత్పత్తి. ఇది గొప్ప కండీషనర్, మాయిశ్చరైజర్ సాధనం. గడ్డానికి పోషణనిచ్చి, అది పెరిగేలా చేస్తుంది. గడ్డం బామ్‌లలో షియా బటర్, బీస్వాక్స్, ఆర్గాన్, జోజోబా ఆయిల్ వంటి సహజ పదార్ధాలు ఉంటాయి. బీయర్డ్ బామ్ సహజంగా గడ్డానికి తేమను పునరుద్ధరిస్తుంది. గడ్డం తాజాగా, శుభ్రంగా కనిపించేలా చేస్తుంది. బీయర్డ బామ్..మీ గడ్డం బాగా పెరిగిన తర్వాత అందంగా కనిపించేలా మెయింటెయిన్ చేయడానికి (Beard Balm Vs Beard Oil) ఉపయోగపడుతుంది.