Banana: ప్రతిరోజు అరటి పండు తింటే చర్మం,జుట్టు అలా అవుతుందా?
అరటిపండు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అరటిపండు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను క
- By Anshu Published Date - 10:13 PM, Wed - 13 September 23

అరటిపండు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అరటిపండు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగించడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమంది ఆరోగ్యం కోసం ఉపయోగిస్తే మరికొందరు అందానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.. అరటిపండ్లలో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి 6, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి.
అరటిపండు తినడం మంచిదే కానీ శృతి తింటే మాత్రం సమస్యలు తప్పవు. మరి అరటిపండు తినడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయోఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటిపండ్లు జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో విటమిన్-సి, విటమిన్ బి 6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు, చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పొటాషియం జుట్టు, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. ఇది జుట్టు తెగిపోవడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టును అందంగా, సిల్కీగా ఉంచుతుంది. ప్రస్తుతం చాలా మంది డ్రై హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు.
అయితే అరటిపండ్లు ఈ సమస్యను నివారించడానికి సహాయపడతాయి. అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అరటిపండ్లు మిమ్మల్ని చురుగ్గా, ఎనర్జిటిక్ గా ఉంచుతాయి. అలాగే ఆరోగ్యకరమైన రీతిలో శరీర బరువును నియంత్రించడానికి అరటిపండ్లు సహాయపడతాయి. మీకు మూడ్ డిజార్డర్, యాంగ్జైటీ వంటి సమస్యలు ఉంటే వెంటనే అరటిపండ్లు తినండి. ఇవి మిమ్మల్ని ఈ సమస్యల నుంచి బయటపడేస్తాయి. అరటిపండ్లను తినడం వల్ల హ్యాపీగా, రిఫ్రెష్ గా అనిపిస్తుంది. అరటిపండ్లు గుండె ఆరోగ్యాన్ని, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.