Banana Burfi: ఎంతో టేస్టీగా ఉండే బనానా బర్ఫీ.. సింపుల్ గా ఇంట్లోనే చేసుకోండిలా?
మామూలుగా అరటికాయతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. అరటికాయ చిప్స్, అరటికాయ మసాలా కూర, అరటికాయ కర్రీ ఇలా రకరకాల రెసిపీ
- By Anshu Published Date - 09:00 PM, Wed - 10 January 24

మామూలుగా అరటికాయతో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. అరటికాయ చిప్స్, అరటికాయ మసాలా కూర, అరటికాయ కర్రీ ఇలా రకరకాల రెసిపీలు తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా బనానా బర్ఫీ ట్రై చేశారా. ఎప్పుడు తినకపోతే ఈ రెసిపీ ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బనానా బర్ఫీకు కావాల్సిన పదార్థాలు:
అరటి పండ్లు – 3
కొబ్బరికోరు – ఒకటిన్నర కప్పు
నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్
మిల్క్ పౌడర్ – 1కప్పు
బెల్లం తురుము – ముప్పావు కప్పు
ఏలకుల పొడి- హాఫ్ టీస్పూన్
చిక్కటి పాలు – పావు కప్పు
బాదం- గార్నిష్ కోసం
బనానా బర్ఫీ తయారీ విధానం:
ఇందుకోసం ముందుగా ఒక బౌల్ లో కొబ్బరి కోరు, బెల్లం తురుము, పాలు పొసి సిమ్ ఫ్లేమ్ లో స్టవ్ మీద పెట్టి గరిటెతో కలుపుతూ ఉండాలి. అలా కొంచెం దగ్గర పడుతున్న సమయంలో అందులో నెయ్యి, అరటిపండు గుజ్జు, మిల్క్ పౌడర్, ఏలకుల పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమం దగ్గర పడగానే ఒక పాత్రలోకి తీసుకుని జీడిపప్పు, బాదం ముక్కలతో గార్నిష్ చేసి 3 లేదా 4 గంటలు ఫ్రిజ్ లో పెట్టాలి. తర్వాత కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే బనానా బర్ఫీ రెడీ.