Bad Dreams : నిద్రలో పీడకలలు ఎక్కువగా వస్తున్నాయా? అయితే ఆరోగ్యానికి మంచిది కాదు..
కొందరికి మంచి కలలు వస్తుంటాయి. మరికొందరికి పీడకలలు(Bad Dreams) వస్తుంటాయి.
- Author : News Desk
Date : 25-10-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
నిద్రలో(Sleep) ఉన్నప్పుడు మనకు కలలు(Dreams) రావడం అనేది సహజం. అయితే కొందరికి మంచి కలలు వస్తుంటాయి. మరికొందరికి పీడకలలు(Bad Dreams) వస్తుంటాయి. ఈ పీడకలల వలన ఎక్కువగా భయపడి నిద్రలో కేకలు పెడుతుంటారు. పీడకలలు రావడం వలన నిద్ర పోవడానికి కూడా కొంతమంది భయపడతారు. కాబట్టి పీడకలలు ఎప్పుడో ఒకసారి వస్తే పర్వాలేదు కానీ రోజూ పీడకలలు వస్తూ ఉంటే మాత్రం రకరకాల సమస్యలకు దారితీస్తుంది.
పీడకలలు ఎక్కువగా వచ్చే వారిలో జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. మతిమరుపు వచ్చే అవకాశం ఉంది ప్రతి విషయం గుర్తుపెట్టుకోలేరు. ఈ విధంగా విషయాలను మర్చిపోవడాన్ని డిమెన్షియా అంటారు. ఎవరికైతే పీడకలలు ఎక్కువగా వస్తాయో వారికి మతిమరుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని 2600 మంది మీద పరిశోధన జరిపి మరీ వెల్లడించారు. అందుకని ఎవరికైతే ఎక్కువగా పీడకలలు వస్తాయో వారికి సరైన నిద్ర అనేది ఉండదు. కాబట్టి వారు ముందు నిద్ర మీద ధ్యాస పెట్టాలి.
రాత్రి పూట తొందరగా నిద్రపోకుండా ముబైల్ స్క్రీనింగ్ మీద ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని వలన స్లీప్ ఆప్నయా వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య వలన నిద్రలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో కూడా నిద్రలో పీడకలలు ఎక్కువగా వస్తాయి. యాంటి డిప్రసెంట్లు ఎక్కువగా వాడే వారిలో కూడా పీడకలలు వస్తుంటాయి. ఈ పీడకలలు ఆడవారిలో కంటే మగవారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి జబ్బులు వచ్చిన వారికి పీడకలలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి పీడకలలు వస్తే పర్వాలేదు కానీ తరచుగా పీడకలలు వచ్చే వారు వారి హెల్త్ ను ఒకసారి చెక్ చేయించుకోవాలి.
Also Read : Pet Dog : కుక్కను పెంచుకోవడం వలన కాపలా ఒకటే కాదు.. ఎన్నో ప్రయోజనాలు..